Pawan Kalyan : ప్రతీ హీరో కి తమ సినిమాలను థియేటర్స్ లో కూర్చొని అభిమానుల మధ్య చూడాలనే కోరిక ఉంటుంది. కానీ వాళ్ళు సెలెబ్రిటీలు అవ్వడం వల్ల, థియేటర్స్ కి వస్తే ఆడియన్స్ కి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఇంట్లోనే హోమ్ థియేటర్ లో కూర్చొని చూసే పరిస్థితి ఏర్పడింది. రిస్క్ చేసి థియేటర్స్ లోకి వచ్చి సినిమా చూస్తే, సంధ్య థియేటర్ ఘటన వంటివి చోటు చేసుకుంటాయి. అందుకే హీరోలు సాధ్యమైనంత వరకు రిస్క్ చేయరు. కానీ కొంతమంది స్టార్ హీరోలు మాత్రం ముఖానికి మాస్కులు వేసుకొని, తమని ఎవ్వరూ గుర్తు పట్టకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొని థియేటర్స్ లో సినిమాలు చూస్తుంటారట. తమిళ హీరో విజయ్ అలా చాలా సినిమాలే చూసాడు. హైదరాబాద్ గోకుల్ థియేటర్ లో ఆయన ముఖానికి మాస్కు వేసుకొని ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని చూసాడు. కేవలం సలార్ ఒక్కటే కాదు, అంతకు ముందు అదే థియేటర్ లో చాలా సినిమాలు చూసాడు.
అయితే పవన్ కళ్యాణ్ కూడా అలా కొన్ని సినిమాలు చూసాడనే విషయం మీకెవరికైనా తెలుసా..?, నిన్న ఆయన సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడుతూ, ఈ విషయంపై ప్రస్తావించాడు. అప్పట్లో తన అన్నయ్య చిరంజీవి అనేక సినిమాలు ముఖానికి మాస్క్ వేసుకొని వెళ్లి చూశాడట. అలా పవన్ కళ్యాణ్ కూడా రెండు మూడు సందర్భాల్లో ముఖానికి మాస్క్ వేసుకొని వెళ్లి చూసినప్పుడు అభిమానులు ఒక్కసారి గుర్తు పట్టేశారట. అప్పటి నుండి ఆయన మళ్ళీ అలాంటి రిస్క్ చేయదల్చుకోలేదట. ఆయన ఏ సినిమాలు అలా చూశాడో చెప్పలేదు కానీ, సోషల్ మీడియా లో మాత్రం ఆయన థియేటర్ లో దొంగచాటున చూసిన సినిమాలు ఇవే అంటూ ప్రచారం అవుతున్నాయి. అప్పట్లో చెన్నై లోని ఒక పాపులర్ థియేటర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఇలాగే ముఖానికి మాస్క్ వేసుకొని వెళ్లి చూసాడు.
ఆంధ్ర ప్రదేశ్ థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ ఎన్ని మాస్కులు వేసుకొని వెళ్లినా, ఆ కళ్ళని చూసి అభిమానులు గుర్తు పట్టేస్తారు. అందుకే ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా, ఎక్కువగా చెన్నై లోని ఒక పాపులర్ థియేటర్ లో చూస్తాడట. తనకి ఎప్పుడు ప్రేక్షకుల మధ్య చూడాలి అనిపించినా అలాగే చూస్తాడట. అలా ఆయన బాహుబలి, #RRR , కల్కి వంటి చిత్రాలు చూశాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ప్రభాస్ అభిమానులు మాత్రం మా సినిమాలనే ఎక్కువగా చూసాడు అంటూ ఎలివేషన్స్ వేసుకుంటున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో షూటింగ్ చివరి దశలో ఉన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రాన్ని మార్చి 28వ తారీఖున విడుదల చేయబోతున్నారు. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రం తర్వాత ఆయన ఓజీ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.