Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియో తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఏఎన్నార్ కి అన్నపూర్ణ స్టూడియో అంటే చాలా ఇష్టం. దాంతో ఆయనకు ఎనలేని అనుబంధం ముడిపడి ఉంది. కాగా అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ కి తెలియకుండా నాగార్జున కొన్ని పనులు చేశాడట. ఆ మేటర్ ఏమిటో చూద్దాం.
టాలీవుడ్ చెన్నై నుండి హైదరాబాద్ కి రావడానికి ఏఎన్నార్ చాలా కృషి చేశారు. తనతో సినిమాలు చేయాలనుకునే దర్శక నిర్మాతలు హైదరాబాద్ రావాల్సిందే. ఇక్కడే నేను సినిమాలు చేస్తానని ఏఎన్నార్ కండిషన్ పెట్టాడట. తెలుగు సినిమాను హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో భాగంగానే ఆయన అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. దశాబ్దాలుగా సినిమా నిర్మాణానికి సంబంధించిన వివిధ సేవలు అన్నపూర్ణ స్టూడియో అందిస్తుంది.
అన్నపూర్ణ స్టూడియో అంటే ఏఎన్నార్ కి ఎంతో ఇష్టం అట. 2014లో ఏఎన్నార్ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. ఇటీవల ఏఎన్నార్ విగ్రహాన్ని స్టూడియోలో ఏర్పాటు చేశారు. విగ్రహ ఆవిష్కరణకు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. నాగ చైతన్య-శోభిత వివాహం అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ విగ్రహం వద్ద జరుపుకున్నారు. అంతటి బలమైన సెంటిమెంట్ అన్నపూర్ణ స్టూడియోతో ఆ కుటుంబానికి ఉంది.
అయితే ఆ స్టూడియోలో ఏఎన్నార్ కి తెలియకుండా నాగార్జున బీర్ కొట్టేవాడట. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా తెలియజేశాడు. అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి చిత్రం 2018లో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కి నాగార్జున అతిథిగా వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో గూఢచారి మూవీ షూటింగ్ జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గూఢచారి టీమ్ అన్నపూర్ణ స్టూడియోలో 17 రోజులు షూటింగ్ చేశారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. అది కూడా అంత అవుట్ డోర్ లో చేశారట.
అసలు అన్నపూర్ణ స్టూడియోలో అన్ని రోజులు షూటింగ్ ఎలా చేశారు? అక్కడ నాకు తెలియని లొకేషన్స్ ఏమున్నాయి?.. నాన్నగారు బ్రతికుంటే నిజంగా సంతోషం వ్యక్తం చేసేవారు. వీళ్ళు అన్నపూర్ణ స్టూడియో వాడినట్లు వేరొకరు వాడలేదని మాత్రం చెప్పగలను. నేను చిన్నప్పుడు నాన్నగారికి తెలియకుండా ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్లి బీర్ తాగేవాడిని, అంత వరకు నాకు తెలుసు. అదే ఫారెస్ట్ లో వీరు షూట్ చేశారట, అన్నారు.
గూఢచారి మూవీ షూటింగ్ ప్రస్తావనలో నాగార్జున తండ్రికి తెలియకుండా స్టూడియోలో బీర్ కొట్టిన మేటర్ బయటపెట్టాడు. అదన్నమాట సంగతి. అడివి శేష్ కి గూఢచారి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీలో ఓ రోల్ చేసిన శోభిత ధూళిపాళ్ల అనూహ్యంగా నాగార్జున ఇంటి కోడలు కావడం విశేషం. శోభితను అక్కినేని నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నాడు.