Johnny Master: జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ పై నేడు ఆయన టీం లో పని చేసే యంగ్ డ్యాన్సర్ పై లైంగిక వేధింపులు చేసాడు అంటూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు ని ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యం లో ఆయనపై FIR నమోదు అయ్యింది. దీంతో జనసేన పార్టీ లో ఒక ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్న జానీ మాస్టర్ ని పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేసాడు. నేటి నుండి జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవద్దని జానీ మాస్టర్ ని ఆదేశించారు. తక్షణమే ఈ యాక్షన్ అమలు లోకి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇటీవలే తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం కి సంబంధించి ఇలాంటి లైంగిక వేధింపులు చేసినందుకు గాను ఆయనని పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంఘటన మన అందరికీ తెలిసిందే. అయితే ఆదిమూలం లైంగిక దాడి చేసినట్టుగా వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి.
కానీ జానీ మాస్టర్ తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవు, కేవలం ఆరోపణలు మాత్రమే. ఈ విషయంపై జానీ మాస్టర్ స్పష్టత ఇచ్చే లోపే జనసేన పార్టీ తరుపున ఇలాంటి యాక్షన్ తీసుకోవడం అభిమానులకు ఒక విధంగా షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే జానీ మాస్టర్ జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు, ఎన్నికల సమయం లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి విస్తృతంగా ప్రచారం చేసాడు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పేరిట జానీ మాస్టర్ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా తలపెట్టాడు. ఇటీవలే వరద బీభత్సం కారణంగా అతలాకుతలం అయిన విజయవాడకు వెళ్లి జనసేన పార్టీ తరుపున బాధితులకు దుప్పట్లు, ఆహార పొట్లాలు అందచేసాడు. ఇలా పార్టీ నాయకుడిగా ఎన్నో సేవలు చేసిన జానీ మాస్టర్ ని, కేవలం ఆరోపణలను ఆధారంగా చేసుకొని సస్పెండ్ చేసి పవన్ కళ్యాణ్ తొందరపడ్డాడు అని అభిమానుల్లో ఉన్న అభిప్రాయం.
వైసీపీ పార్టీ లో వీడియో లతో సహా అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యేలను, అప్పటి సీఎం జగన్ సస్పెండ్ చేయాల్సింది పోయి, వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని, అలాంటిది జానీ మాస్టర్ విషయం లో ఇంతటి తొందరపాటు చర్య ఎలా తీసుకున్నారు అంటూ అభిమానులు పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీ ముఖ్య నాయకులను ప్రశ్నిస్తున్నారు. జానీ మాస్టర్ వెర్షన్ కూడా విని, నిర్ణయం తీసుకొని ఉండుంటే బాగుండేది అని వాళ్ళ అభిప్రాయం. మరి దీనిపై జానీ మాస్టర్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి. జానీ మాస్టర్ నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు అంటే, అందుకు ప్రధాన కారణం మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ ఆయనకి ఎన్నో అవకాశాలు ఇచ్చి నేడు ఈ స్థాయికి ఎదిగేలా చేసాడు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు.
శ్రీ షేక్ జానీ పార్టీ కార్యక్రమాలకు దూరం pic.twitter.com/WdLoQ8CSwH
— JanaSena Party (@JanaSenaParty) September 16, 2024