https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి డేట్స్ కోసం ఎదురుచూస్తున్న తమిళ్ స్టార్ డైరెక్టర్…ఈ కాంబో వర్కౌట్ అవుతుందటరా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఎదురు చూసే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్న చిరంజీవి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు దానికి ఉండే హైప్ అంత ఇంత కాదు. ఇక రికార్డుల మోత కూడా మోగిపోవాల్సిందే...

Written By:
  • Vicky
  • , Updated On : September 16, 2024 / 05:22 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘన కీర్తిని సంపాదించుకున్న చిరంజీవి ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన సాధించిన విజయాలు ఇండస్ట్రీలో ఉన్న మరే హీరోకి సాధ్యం కానీ రీతిలో ఉండటం ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేకపోవడంతో ఘన కీర్తిని సాధించుకున్నాడు. ఇక ఇప్పటికి కూడా చిరంజీవితో సినిమాలు చేయడానికి పలు దర్శకులు పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. లోకేష్ కనకరాజ్ సైతం చిరంజీవితో సినిమా చేయడానికి ఒక కథను సిద్ధం చేసుకున్నానని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం… ప్రస్తుతం ఆయన రజనీకాంత్ తో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే ‘విక్రమ్ 2’ సినిమాని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి అవకాశం ఇస్తే చిరంజీవితో సినిమా చేయడానికి కూడా తను సిద్ధంగా ఉన్నానని దానికి సంబంధించిన కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నానని చెప్పడం విశేషం…

    విక్రమ్ సినిమాతో ఒకసారిగా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకున్న లోకేష్ తన మేకింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. అలాంటి స్టార్ డైరెక్టర్ కూడా చిరంజీవితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే చిరంజీవి మేనియా ఇప్పటికీ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నాడు.

    ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్నప్పటికీ, ఇందులో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కి కూడా పెద్దపీట వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దర్శకుడు వశిష్ట ఈ సినిమాని భారీ సక్సెస్ సాధించే దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మరి చిరంజీవి ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకొని తనదైన రీతిలో సినిమా ఇండస్ట్రీలో తన ప్రభంజనాన్ని సృష్టిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక ఏది ఏమైనప్పటికీ చిరంజీవి చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు విశ్వంభర సినిమా మరొక ఎత్తుగా నిలువబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి తొందర్లోనే ఆయన లోకేష్ కనకరాజ్ తో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక లోకేష్ తో చేయబోయే సినిమాలో చిరంజీవిని ఒక మాఫియా డాన్ గా చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది…