Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Sukumar Movie Update: ఆ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి...

Pawan Kalyan Sukumar Movie Update: ఆ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి ఉంటే నెంబర్ వన్ దర్శకుడు అయ్యేవాడా..?

Pawan Kalyan Sukumar Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కని క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసినవి తక్కువ సినిమాలే, తనకి వచ్చినవి కూడా చాలా తక్కువ సక్సెస్ లే అయిన కూడా ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. ప్రేక్షకులు అతని రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. స్క్రీన్ మీద అతను కనిపిస్తే చాలు విజిల్స్ తో థియేటర్ మొత్తం మొత్తం మోగిపోద్ది. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు… ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు వాళ్ల ఎంటైర్ కెరియర్లో అతనితో ఒక్క సినిమా అయిన చేయాలని అనుకుంటారు. కారణం ఏంటి అంటే ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

తద్వారా సూపర్ సక్సెస్ గా నిలుస్తాయి. సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా ఆయన అభిమానులు దాన్ని సూపర్ సక్సెస్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అందువల్లే అతనితో సినిమా చేస్తే టాప్ డైరెక్టర్ గా ఎదగవచ్చనే ఉద్దేశ్యంతోనే చాలామంది స్టార్ డైరెక్టర్లు అతనితో సినిమాని చేస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో ఒక దర్శకుడు సినిమా చేసి ఉంటే ఆయన ఇప్పటికే ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారేవాడు అంటూ గతంలో రాజమౌళి కొన్ని కామెంట్లు చేశాడు. ఇంతకీ ఆయన ఏ దర్శకుడిని ఉద్దేశించి అలా మాట్లాడాడో తెలుసా…’ఆర్య’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన సుకుమార్ తన కెరియర్ స్టార్టింగ్ లో ఆర్య, జగడం లాంటి సినిమాలు చేశాడు.

జగడం సినిమాలో ఉన్న ఎలివేషన్స్ లాంటి వాటిని వాడుకొని పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తే అతని రాత మారిపోయేది అంటూ రాజమౌళి చెప్పడం విశేషం…ఇక సుకుమార్ సైతం పలుసార్లు పవన్ కళ్యాణ్ ని కలిసి అతనితో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు… అందుకే సుకుమార్ ఎక్కువగా అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబులతో సినిమా చేసుకుంటూ వచ్చాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular