Pawan Kalyan Fans Reaction : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Churanjeevi)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆయన తమ్ముడి గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) సైతం చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి లేనటువంటి ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగాడు. అలాంటి పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుంచి చాలా బిజీగా ఉండటం వల్ల ఒక సినిమాని కూడా రిలీజ్ చేయలేకపోతున్నాడు. ఇక అంతకు ముందు కమిట్ అయిన సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం వాటిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేశాడు. ఇక ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనే దానిమీద సరైన క్లారిటీ లేకపోయినప్పటికి రీసెంట్ గా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి (OG) సినిమా షూటింగ్ ను సైతం కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక వీటితోపాటుగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh) సినిమా కోసం ఆయన తన డేట్స్ ని కేటాయించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆ సినిమా కోసమే తన అవుట్ ఫిట్ మొత్తాన్ని మార్చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read : ‘హరి హర వీరమల్లు’ నిర్మాతకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్..ఎవ్వరూ ఊహించి ఉండరు!
కొత్త లుక్ లోకి మారిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సినిమా ఇండస్ట్రీకి కొద్దిరోజుల పాటు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయా సినిమాల ప్రొడ్యూసర్లు సగం సినిమా చేసి చాలా రోజులు పాటు వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాలను కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో తను చాలా బిజీగా ఉన్నప్పటికి ఈ సినిమా షూట్ ని కంప్లీట్ చేయాలని ముందుకు సాగినట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే రెండు సినిమాలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన ఆయన ఇప్పుడు మూడో సినిమాని సైతం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి వీలైనంత తొందరగా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన స్పీడ్ ని చూసి చాలా సంబరపడిపోతున్నారు. వీలైనంత తొందర్లో పవన్ కళ్యాణ్ నుంచి మూడు సినిమాలను మనం చూసి ఎంజాయ్ చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో అభిమానులు ఉన్నారు…