AP Rains : ఏపీకి ( Andhra Pradesh) చల్లటి కబురు. బంగాళాఖాతంలో( Bay of Bengal) ఏర్పడిన ఉపరితల ద్రోణి మరింత బలపడింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంగళవారం చెప్పుకోదగ్గ వర్షాలు పడ్డాయి. కాకినాడ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కొండపోతగా వర్షం పడింది. వచ్చే 48 గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Also Read : జనసేన ఎమ్మెల్యేను లెక్కచేయని టిడిపి ఇన్చార్జ్!
* ఉత్తరాంధ్రలో వర్షాలు
ఉత్తరాంధ్ర తో ( North Andhra) పాటు ఏజెన్సీ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. ఏపీలో వర్షాలపై విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసింది. శుక్రవారం వరకు ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చనే దానిపై తన అంచనాలను వెల్లడించింది. అదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు తెలిపింది. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన ఆవర్తనం బలపడింది. అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి అక్కడే కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా, క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని తెలిపారు.
* మరో రెండు రోజులు అదే పరిస్థితి..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితలం ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం వరకు వర్షాలు కొనసాగుతాయి. నేడు, రేపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉంది. శుక్రవారం సైతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది విపత్తుల నిర్వహణ సంస్థ. రైతులు వ్యవసాయ పనుల్లో ఉండేటప్పుడు.. పశువుల పెంపకం దారులు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చెట్లు, స్తంభాలు, టవర్ల కింద ఉండకూడదని హెచ్చరించింది.
* కొనసాగుతున్న ఎండల తీవ్రత..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత( summer heat) కొనసాగుతోంది. మంగళవారం రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగింది. నంద్యాల జిల్లా దొర్నిపాడు, కడప జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదు అయింది. కర్నూలు జిల్లా కామవరంలో 40.7, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6, ప్రకాశం జిల్లా దరి మడుగ లో 40.6 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత కనిపించింది. ఈరోజు 25 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
Also Read : రీల్ హీరో కాదు రియల్ హీరో.. గిరిజనుల మదిని దోచిన పవన్ కళ్యాణ్!