Pawan Kalyan remuneration hari hara veeramallu : ఇండియాలో ఎవరికి లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ఒకరు… ఆయన సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన అవకాశం దొరికిన ప్రతిసారి తన సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…
ఈనెల 12వ తేదీన పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) హీరోగా చేసిన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిన కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పెట్టిన ఎఫర్ట్స్ అయితే చాలా హైలెట్ గా నిలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటూ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఏ మూవీ షూట్ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికి అప్పటినుంచి ఇప్పటివరకు సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడని తన అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ని సైతం తిరిగి ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read : కన్నీళ్లు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణమా?
ఎందుకంటే ఈ సినిమా భారీగా లేట్ అవుతున్న నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ కి విపరీతంగా నష్టాలు వస్తాయని ఉద్దేశ్యంతోనే ఆయన తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేసారట. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంవల్ల ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ వల్లే ఈ సినిమా లేట్ అవ్వడం వల్ల ప్రొడ్యూసర్ యొక్క కష్టాలను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ తనకిచ్చిన రెమ్యూనికేషన్ తిరిగి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.
నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలు సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయిన వాటికి ఉండే గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి.
ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ అయితే వస్తాయి. ఇక ప్రొడ్యూసర్స్ కష్టాలు తెలిసిన హీరో కూడా తనే కావడం విశేషం…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్లాప్ అయినప్పుడు కూడా తన రెమ్యూనరేషన్ ను ఆయా ప్రొడ్యూసర్లకు తిరిగి ఇచ్చిన విషయం మనకు తెలిసిందే…మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది…