https://oktelugu.com/

పవన్ రెమ్యునరేషన్ రోజుకు అంత తీసుకుంటున్నాడా..!

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజే వేరు. సినిమా హిట్టయితే వచ్చే లాభాలు భారీ స్థాయిలో ఉంటాయి. కానీ ఖర్చు కూడ తడిసిపోతుంది. అయినా హిట్ కొడితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని నిర్మాతలు చాలామంది ఆయనతో సినిమా చేయడానికి సాహసిస్తుంటారు. ఇదొక లాటరీ లాంటిదే. కొడితే కుంభస్థలమా లేకపోతే పాతాళమా అంతే. పవన్ సినిమా చేసి రెండేళ్ళు అవుతోంది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత ప్రాపర్ హిట్ లేదు. అయినా ఆయన లెవల్ ఏమాత్రం తగ్గలేదు. […]

Written By:
  • admin
  • , Updated On : October 29, 2020 / 05:15 PM IST
    Follow us on


    పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజే వేరు. సినిమా హిట్టయితే వచ్చే లాభాలు భారీ స్థాయిలో ఉంటాయి. కానీ ఖర్చు కూడ తడిసిపోతుంది. అయినా హిట్ కొడితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని నిర్మాతలు చాలామంది ఆయనతో సినిమా చేయడానికి సాహసిస్తుంటారు. ఇదొక లాటరీ లాంటిదే. కొడితే కుంభస్థలమా లేకపోతే పాతాళమా అంతే. పవన్ సినిమా చేసి రెండేళ్ళు అవుతోంది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత ప్రాపర్ హిట్ లేదు. అయినా ఆయన లెవల్ ఏమాత్రం తగ్గలేదు.

    Also Read: బాలయ్య వచ్చేశాడు.. ఇక మిగిలింది మెగాస్టారేనా..!

    మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నానని ఆయన చెప్పగానే నిర్మాతలు క్యూ కట్టేశారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రతి సినిమాకూ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికవరకు ఇండస్ట్రీలో ఆయన తీసుకుంటున్నదే హయ్యస్ట్ పారితోషకమనే టాక్ ఉంది. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని దాదాపు ముగించిన ఆయన త్వరలోనే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ప్రాజెక్టుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం కోసం కేవలం 30 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చారు పవన్.

    Also Read: కరోనా నుంచి ఆ అగ్ర హీరో ఎస్కేప్ అయినట్టేనా?

    ఈ 30 రోజులకుగాను ఆయన 50కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 30 రోజులకు 50 కోట్లు అంటే రోజుకు కోటి 60 లక్షల పైమాటే. ఈ పారితోషకంలో లాభాల్లో షేర్లు, డిస్ట్రిబ్యూషన్ హక్కులు లాంటివేమీ లేవు. అచ్చంగా 50 కోట్లు ఆయనకు ముట్టజెప్పాల్సిందే. అన్నింటిలోనూ కొత్త ట్రెండ్ సృష్టించే పవన్ పారితోషకం విషయంలో కూడ కొత్త రికార్డులు క్రియేట్ చేశారన్నమాట.