Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ ఐడెంటిటిని కాపాడుకుంటూ స్టార్ హీరోల రేంజ్ లో ముందుకు దూసుకు వెతుకుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకున్న వాళ్లే కావడం విశేషం… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా మారిపోయాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతో సినిమాలను చేశాడు. ముఖ్యంగా ఆయన ఒక దర్శకుడితో సినిమా చేసి ఉంటే బాగుండేదని అప్పట్లో చిరంజీవి సైతం పలుమార్లు రికమెండ్ చేసిన కూడా పవన్ కళ్యాణ్ అయితే అతనితో సినిమా చేయడానికి ఇష్టపడలేదట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే రాఘవేంద్రరావు కావడం విశేషం… అప్పటికే టాప్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న రాఘవేంద్రరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఎందుకని సినిమా చేయలేదు అంటే రాఘవేంద్రరావు అప్పటికే 95 సినిమాలకు పైన మూవీస్ చేశాడు.
ప్రత్యేకించి ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన చేయకపోయినా రాఘవేంద్రరావుకు వచ్చేదైతే ఏమీ లేదు. ఇక పవన్ కళ్యాణ్ సైతం యూత్ కి ఎక్కువగా అవకాశాలు ఇద్దామని ఫిక్స్ అయ్యాడు. కాబట్టి కుర్ర దర్శకులను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ యంగ్ స్టర్స్ ను ఎంకరేజ్ చేశాడు. ఇక అందులో భాగంగా తొలిప్రేమ సినిమాతో కరుణాకరన్, బద్రి సినిమాతో పూరి జగన్నాధ్ ఇద్దరు కూడా దర్శకులుగా పరిచయమయ్యారు.
ఆ తర్వాత వాళ్ళు చాలా సంవత్సరాల పాటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా కొనసాగారు. ఇక ఏది ఏమైనా కూడా అప్పట్లో చిరంజీవి రాఘవేంద్రరావు తో ఒక్క సినిమా చేయమని పవన్ కళ్యాణ్ ను ఫోర్స్ చేస్తారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వినలేదు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ తను ఏదైతే డెసిజన్ తీసుకుంటాడో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఎవరు ఏం చెప్పినా వినడు.
తను ఒక విషయం గురించి పూర్తిగా ఆలోచించుకున్నాక డిసిజన్ తీసుకుంటాడు. కాబట్టి ఆయన విషయంలో ఎలాంటి తప్పు ఉండదని తను మొండిగా నమ్మి ముందుకు వెళ్తుంటాడు. ఇక స్టార్టింగ్ లో కొత్త దర్శకులను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగాడు. సీనియర్ దర్శకులతో పెద్దగా సినిమాలను చేయలేదు…








