https://oktelugu.com/

Pawan Kalyan : బాలకృష్ణ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. తీవ్రమైన నిరాశలో అభిమానులు..అసలు ఏమి జరిగిందంటే!

ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అంత సమయం కేటాయించడానికి వీలు లేనందునే పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ కి హాజరు కాకపోవడానికి కారణం అని అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2024 / 09:17 PM IST

    Pawan Kalyan And Balakrishna

    Follow us on

    Pawan Kalyan : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. రెండు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, మూడవ సీజన్ లిమిటెడ్ గా పూర్తి చేశారు. ఇప్పుడు నాల్గవ సీజన్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక ఎపిసోడ్ ని షూట్ చేసారు. ఇది మొదటి ఎపిసోడ్ గా టెలికాస్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ, ఇప్పట్లో టెలికాస్ట్ చేయరు అనేది లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. రేపు హైదరాబాద్ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మొదటి ఎపిసోడ్ ని చిత్రీకరించబోతున్నారట. ఈ ఎపిసోడ్ మొదటి ఎపిసోడ్ గా రాబోతుందట. ‘అన్ స్టాపబుల్’ రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

    ఇప్పుడు నాల్గవ సీజన్ కూడా చంద్రబాబు తోనే ప్రారంభించడం గమనించాల్సిన విషయం. అయితే రెండు రోజుల క్రితం చంద్రబాబు తో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ మొదటి ఎపిసోడ్ లో హాజరు కాబోతున్నారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకుండా, కేవలం చంద్రబాబు మాత్రమే హాజరు కావడం అందరినీ షాక్ కి గురి చేసింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలకృష్ణ కాంబినేషన్ ని చూడొచ్చు అని ఆశపడిన అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది. పవన్ కళ్యాణ్ ని కూడా ఇదే ఎపిసోడ్ కి చంద్రబాబు తో కలిసి రావాల్సిందిగా ఆహా టీం కోరారట. కానీ పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్ రేపు ఫుల్ బిజీ గా ఉంది. ముఖ్యంగా ఆయన డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలు మాత్రమే కాదు, సినిమా షూటింగ్స్ లో కూడా బిజీ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రాలేనని, కచ్చితంగా సీజన్ లో ఎదో ఒక ఎపిసోడ్ కి వస్తానని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే చంద్రబాబు ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో ఫోన్ కాల్ మాట్లాడించే అవకాశం ఉందని అంటున్నారు.

    గత సీజన్స్ లో కూడా ఇలాంటివి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మొదటి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ కనీసం 5 నిమిషాలు గెస్ట్ గా వచ్చి వెళ్లినా బాగుంటుందని కోరుకుంటున్నారు అభిమానులు. అయితే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ మనకి చూపించేది కేవలం ఒక్క గంట మాత్రమే. కానీ ఆ గంట ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ రోజు మొత్తం చేస్తారు. సీజన్ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్, చంద్రబాబు పాల్గొన్న ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్స్ ని రాత్రి వరకు చేసారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అంత సమయం కేటాయించడానికి వీలు లేనందునే పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ కి హాజరు కాకపోవడానికి కారణం అని అంటున్నారు.