https://oktelugu.com/

Hari Hara Veera Mallu: ఒక్క గంటలో ‘హరి హర వీరమల్లు’ పాటని రికార్డు చేసిన పవన్ కళ్యాణ్..దేశంలోనే ఆల్ టైమ్ ఫాస్టస్ట్ రికార్డ్!

ఈ నెల 30వ తారీఖు తో 'హరి హర వీరమల్లు' సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవ్వబోతుంది. ఆ తర్వాత వెంటనే ఆయన 'ఓజీ' మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెడతాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక బిట్ సాంగ్ పాడబోతున్నాడు అనే వార్త ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారమైన సంగతి అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : October 19, 2024 / 12:19 PM IST
    Hari Hara Veera Mallu

    Hari Hara Veera Mallu

    Follow us on

    Hari Hara Veera Mallu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి ఎన్నో అబ్బీవుద్ది కార్యక్రమాలు చేపడుతూ ముందుకు దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్, చాలా కాలం గ్యాప్ తర్వాత సినిమా షూటింగ్స్ తో బిజీ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. గత నెల 23 వ తారీఖు నుండి పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రోజుకి నాలుగు గంటలు సినిమా షూటింగ్ కి సమయం కేటాయిస్తున్న ఆయన, మిగిలిన సమయం మొత్తం ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యతలకు సమయం కేటాయిస్తున్నాడు.

    ఈ నెల 30వ తారీఖు తో ‘హరి హర వీరమల్లు’ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవ్వబోతుంది. ఆ తర్వాత వెంటనే ఆయన ‘ఓజీ’ మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెడతాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక బిట్ సాంగ్ పాడబోతున్నాడు అనే వార్త ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాట ని దీపావళి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాలు సైతం చెప్పుకొచ్చింది. అయితే ఈ పాట ని పవన్ కళ్యాణ్ నిన్ననే రికార్డు చేసాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. నిన్న ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ సెట్స్ లోనే ఆయన కేవలం ఒక్క గంట సమయాన్ని తీసుకొని, ఈ పాట ని పూర్తి చేసాడట. ఇది ఇప్పుడు దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే చేయనున్నారు మేకర్స్. సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. కేవలం గంటలో ఒక్క పాటని రికార్డు చేయడం ఇప్పటి వరకు హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు. ఎంత పెద్ద గాయకుడికి అయినా ఒక్క పాట పాడేందుకు ఒక్క రోజు సమయం మొత్తం తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కేవలం గంటలో పూర్తి చేసి, సరికొత్త రికార్డు ని నెలకొల్పాడు. రెండు నుండి మూడు నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ పాటకి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందించాడు.

    మార్చి 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నుండి సినిమా విడుదలై మూడేళ్లు కావొస్తుంది. ఆయన హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం 2022 వ సంవత్సరంలో విడుదలైంది. ఆ తర్వాత ‘బ్రో ది అవతార్’ చిత్రంలో నటించాడు కానీ, అది కేవలం సపోర్టింగ్ రోల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ సినిమా లెక్కలోకి రాదు. అందుకే ‘హరి హర వీరమల్లు’ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పైగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల అవ్వబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రాన్ని ఒక ఉత్సవం లాగా ప్లాన్ చేసుకున్నారు.