Jagan: సాక్షికి పనిచేస్తే జర్నలిస్ట్.. వైసీపీకి పని చేస్తే పొలిటీషియన్.. జగన్ బంపర్ ఆఫర్

మీడియా రాజకీయ పార్టీల వారీగా మారిపోయింది. ప్రతి పార్టీకి అధికారికంగా ఒక మీడియా ఏర్పాటయింది. అదే సమాజంలో ఇబ్బందికర పరిస్థితులకు దారితీసింది. ఇప్పుడు మీడియా అంటేనే ఒక రకమైన విమర్శ ఉంది.

Written By: Dharma, Updated On : October 19, 2024 12:08 pm

YS Jagan

Follow us on

Jagan: టిడిపికి అనుకూల మీడియా ఉంది. మనకి ఒక అనుకూల మీడియా ఉండాలన్న కోణంలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడితో సాక్షి మీడియాను ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో ఈనాడుకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఈ మీడియా వింత పోకడలతో ముందుకు సాగింది. అదో సామాజిక వర్గానికి పునరావాస శిబిరంగా మారింది. అయితే వైసీపీలో పని చేసిన వారే సాక్షిలో కనిపిస్తారు. సాక్షి మీడియాలో పనిచేసిన వారే వైసిపికి అక్కరకు వస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇలానే వచ్చారు. ఆయనేదో ఉత్తమ జర్నలిస్ట్ కాదు. సీనియర్ జర్నలిస్ట్ అంతకంటే కాదు. ఆయన ఓ సాధారణ జర్నలిస్ట్. ఎప్పుడో ఉదయం పత్రిక సమయంలో ఆయన పని చేశారు. ఆయనను తీసుకొచ్చి ఏకంగా సాక్షికి ఎడిటోరియల్ డైరెక్టర్ ను చేశారు. అక్కడ ఉంచకుండా పార్టీ లోకి తెచ్చి ప్రమోషన్ ఇచ్చారు. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి తో జగన్ కు ఎటువంటి సంబంధం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు ఓ సాధారణ కాంట్రాక్టర్. రాజశేఖర్ రెడ్డి కి సన్నిహితుడు. జగన్ పేపరు పెట్టినప్పుడు సదరు కాంట్రాక్టర్ ను రాజశేఖర్ రెడ్డి పిలిచారు. మీ సోదరుడు ఉదయం లో పనిచేసిన అనుభవం ఉంది కదా? తీసుకురండి అంటూ పురమాయించారు. అలా వచ్చిన సజ్జల రాత్రికి రాత్రే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ అయ్యారు. అయితే అదే సజ్జల వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంట్రీ ఇచ్చారు పార్టీలోకి. తర్వాత ప్రభుత్వంలో సైతం కీలకంగా మారిపోయారు. అయితే కేవలం సాక్షిలో చైర్మన్ గా ఉన్న భారతితో పొసగక సజ్జల రామకృష్ణారెడ్డిని మార్చారని తొలుత కామెంట్స్ వినిపించాయి. అంటే సాక్షిలో ఫెయిల్ అయిన వ్యక్తిని తీసుకువచ్చి ప్రభుత్వంలో సెట్ చేశారన్నమాట.

* అప్పుడెప్పుడో ఉదయం పత్రికలో పనిచేశారట
ఉదయం పత్రిక సమయంలో డెస్క్ లో పనిచేసే వారు సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పుడెప్పుడో ఆయన జర్నలిస్ట్. కానీ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడికి సోదరుడు కావడంతో సజ్జలకు కలిసి వచ్చింది. ఆపై సామాజిక వర్గం సైతం పనిచేసింది. అంతకంటే మించి తమ వారే ఈ రాష్ట్రాన్ని పాలించాలన్న లక్ష్యం అక్కరకు వచ్చింది. ఇవన్నీ వెరసి రామకృష్ణారెడ్డిని అందలం ఎక్కించింది. ముందుగా సాక్షి లోకి ఎంట్రీ ఇచ్చారు సజ్జల. అక్కడ ఏకంగా ఎడిటోరియల్ డైరెక్టర్ అయ్యారు. అక్కడ నుంచి ప్రభుత్వ సలహాదారుడిగా చేరారు. జగన్ ముఖ్య సలహాదారుడిగా మారిపోయారు. ఏకంగా ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఎదిగిపోయారు. పార్టీలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జర్నలిస్ట్ అనే బ్యాగ్రౌండ్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఓ రేంజ్ లో పెట్టింది.

* తాజాగా కొత్త నియామకం
తాజాగా సాక్షిలో పనిచేసిన ఈశ్వర ప్రసాదరెడ్డిని తీసుకొచ్చి.. వైయస్సార్ కాంగ్రెస్ ఇంటలెక్చువల్ ఫోరంను ఏర్పాటుచేసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారట. ఆయన సైతం సాక్షిలో డైరెక్టర్ స్థాయిలోనే ఉన్నారు. అయితే ఆయన గురించి అక్కడ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. సాక్షి ఆవిర్భావం నుంచి అదే మీడియాలో కొనసాగుతూ వచ్చారు. అక్కడ ఫెయిల్ అయిన వారిని తీసుకువచ్చి ఇప్పుడు పార్టీ బాధ్యతలు అప్పగించారు. దీంతో సాక్షిలో పనికిరాని వారిని వైసిపి పై రుద్దుతున్నారా అన్న ప్రశ్న వినిపిస్తోంది.సాధారణంగా వామపక్ష పార్టీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పార్టీలకు అనుబంధంగా ఉండే పత్రికలకు పార్టీ నేతలను ఎడిటర్లుగా పంపిస్తుంటారు. అయితే వైసీపీలో విరుద్ధంగా కనిపిస్తోంది. పత్రికలో ఫెయిల్ అయిన వారిని వైసిపి పార్టీని చక్కదిద్దే బాధ్యతలు అప్పగిస్తుండటం విశేషం.

* ఎడిటర్ గా ధనుంజయ రెడ్డి?
వైసిపి హయాంలో సాక్షిలో పనిచేసే ధనుంజయ రెడ్డి నామినేటెడ్ పదవి పొందారు. వైసిపి అధికారంలోకి వచ్చేందుకు చాలా విధాలుగా సాయం చేశారు ధనంజయ రెడ్డి. అది కూడా సాక్షి ద్వారానే. అయితే భారతి చైర్మన్ అయ్యాక.. ఆమెతో ధనుంజయ రెడ్డి విభేదించడంతో నామినేటెడ్ పదవి కట్టబెట్టి బయటకు పంపించేశారు. అయితే ఇప్పుడు అదే ధనుంజయ రెడ్డిని సాక్షి ఎడిటర్ గా ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే సాక్షిలో పనిచేస్తే జర్నలిస్ట్.. పార్టీకి పనిచేస్తే పొలిటీషియన్ గా మారిపోతున్నారన్నమాట. దేశంలో ఏ పార్టీకి, ఏ పత్రికకు ఇటువంటి పరిస్థితి లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.