Hari Hara Veeramallu : మరో మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సాయంత్రం శిల్ప కళా వేదిక లో అంగరంగ వైభవం జరగనుంది. అయితే నిన్న సాయంత్రం అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ మూవీ టీం కి ఫోన్ చేసి రేపు ఉదయం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయండి అంటూ ఆదేశించాడు. ఈ వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం తో అభిమానులు ‘అదేంటి..? రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకొని ప్రెస్ మీట్ అంటున్నారంటే, కొంపదీసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైనా రద్దు అయ్యిందా?’ అని భయపడ్డారు. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే వాయిదా పడినట్టు ట్వీట్స్ కూడా వేశాయి. ఆ తర్వాత మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది అని ఖరారు చేయడం తో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించాలని అనుకుంటున్నాడు?, మార్కెట్ ఈ చిత్రానికి తన గత చిత్రాలతో పోలిస్తే అంతగా క్రేజ్ లేదు అనే విషయాన్ని గ్రహించాడా?, నిర్మాత AM రత్నం దయనీయమైన పరిస్థితి చూడలేకనే పవన్ కళ్యాణ్ ఇలా చేశాడా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగం లోనే ఈ విషయాన్ని బహిర్గతం చేసాడు. సినిమా మొదలై ఆరేళ్ళు అయ్యింది, మార్కెట్ లో పాతబడిన సినిమాగా ముద్ర పడింది. దానికి తోడు ఈ సినిమాపై జరిగిన నెగటివ్ ప్రచారం అంతా ఇంత కాదు. వీటిని అదనుగా తీసుకొని బయ్యర్స్ నిర్మాత AM రత్నం తో చెడుగుడు ఆడేసుకున్నారు. ముఖ్యంగా నైజాం ప్రాంత డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ మూవీ మేకర్స్, SVC ప్రొడక్షన్స్ మధ్య ఆయన పూర్తిగా నలిగిపోయారు.
ఒకానొక దశలో ఆయనకు చిరాకు కలిగి సొంతంగా విడుదల చేసుకోవాలని అనుకున్నాడు. కానీ కుదర్లేదు. చివర్లో పవన్ కళ్యాణ్ కలుగజేసుకొని, AM రత్నం కి ఉన్న ఆర్ధిక ఇబ్బందులన్నీ తొలగించేలా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ని ఈ వ్యవహారం లో తలదూర్చేలా చేసాడు. ఆ తర్వాత నిర్మాత AM రత్నం ని టార్చర్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ మరియు SVC లను పవన్ కళ్యాణ్ మందలించడం తో, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నైజాం ప్రాంత హక్కులను 45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని. ఆ తర్వాత ఈ సినిమా ప్రొమోషన్స్ లో స్వయంగా తాను పాల్గొంటానని పవన్ కళ్యాణ్ మాటిచ్చి, నేడు ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.