Homeఎంటర్టైన్మెంట్Vijay And Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్న తమిళ హీరో...

Vijay And Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్న తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే.

Vijay And Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పొలిటికల్ జర్నీ ఒక గొప్ప ఎలివేషన్స్ ఉన్న కమర్షియల్ సినిమా లాగానే ఉంటుంది. ఒక్కడిగా మొదలై, నేడు కొన్ని కోట్ల మందికి గొంతుకగా నిలిచి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ప్రతీ ఒక్కరికి ఆదర్శమే. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వచ్చే హీరోలకు ఆయన రాజకీయ జీవితం ఒక దిక్సూచి లాంటిది. 2019 ఎన్నికలలో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినప్పటికీ కూడా, ఏ మాత్రం ఆత్మ విశ్వాసం చెరిగిపోకుండా, బలంగా ఒంటరి పోరాటం చేసి, అధికార పక్షానికి వెన్నులో వణుకు పుట్టించి, వాళ్ళ ఘోరమైన ఓటమికి కారణమైన కూటమి ని ఏర్పాటు చేసి, పవన్ కళ్యాణ్ హిస్టరీ లో ఎప్పుడూ చూడనంత భారీ విజయాన్ని చూసాడు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆయన ఎలాంటి సేవలు అందిస్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం.

అయితే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ని అప్పటి సీఎం జగన్ ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముందు ఆయన సినిమాలకు టికెట్ రేట్స్ ఇవ్వడం మానేసాడు, ఫలితంగా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన సినిమాలు, కేవలం 130 నుండి 150 కోట్ల రూపాయిల మధ్యలోనే ఆగాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన ఏదైనా ప్రజా పోరాటం చెయ్యాలని గ్రౌండ్ లోకి దిగితే, అక్కడ కూడా ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేసిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్తుండగా, బోర్డర్ వద్ద ఆయన్ని పోలీసులు ఆపేసిన ఘటన ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చిన రోజు అది.

పవన్ కళ్యాణ్ ని అడ్డుకున్నప్పటికీ కూడా , ఆయన వెనక్కి తగ్గకుండా పోలీసులతో పోరాడి ,రోడ్ల మీద పడుకొని నిరసన వ్యక్తం చేయడం, కారు మీద కూర్చోవడం వంటివి చేశాడు . ఇక పవన్ కళ్యాణ్ ని పోలీసులు అడ్డుకున్నారు అనే విషయం తెలుసుకొని అర్థ రాత్రి చుట్టూ పక్కన ఉన్న గ్రామాల్లోని జనాలు అప్పటికప్పుడు కుప్పలు తెప్పలు గా చేరుకొని , పోలీసులతో పోరాడడం , అనంతరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ని ర్యాలీ గా నిండు వర్షం లో తీసుకొని వెళ్లడం వంటి సన్నివేశాలు సినిమాటిక్ అనుభూతికి ఏ మాత్రం తక్కువ కాదు. అయితే తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) కి కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. కానీ ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ లాగా దయూర్యం చూపించి ముందుకు వెళ్లడం లేదు. దీంతో కొంతమంది విజయ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ చేసినట్టు, ఇలాంటి సీన్స్ ని రిపీట్ చేయండి అంటూ పెద్ద ఎత్తున ట్వీట్స్ వేస్తున్నారు. అందుకు సంబంధించిన ఒక ట్వీట్ ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular