Pawan Kalyan – Poonam Kaur : ఈమధ్య కాలం లో చిన్నారులపై మృగాలు చేస్తున్న అకృత్యాలు రోజురోజుకి ఎక్కువ అయిపోతున్నాయి. గుండెల్ని పిండేసే అరాచక ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. మూడేళ్ళ చిన్నారి లో ఏమి కనిపించింది అసలు?, అలాంటి పసిబిడ్డపై కూడా అత్యాచారం చేయడమా?, అలాంటి వ్యక్తులకు ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంటుందా చెప్పండి. పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయంటే అది కచ్చితంగా ప్రభుత్వం బలమైన చట్టాలు తీసుకొని రాకపోవడం వల్లే కదా?, తప్పు చేసినా తప్పించుకోగలము అనే ధీమా ఉండడం వల్లే కదా?, ఈ అకృత్యాలు మొత్తం ఆగేది ఎప్పుడు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ లో ఒక మూడేళ్ళ చిన్నారి పై జరిగిన అత్యాచార ఘటన కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను కలిచివేసింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటన జరగడం కొత్తేమి కాదు. కూటమి ప్రభుత్వం లోనే కాదు, గత వైసీపీ పాలన లో కూడా ఇలాంటి అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రీసెంట్ గా జరిగిన ఘటనపై నెటిజెన్స్ నుండి సినీ సెలబ్రిటీల వరకు చాలా ఘాటుగానే స్పందించారు. సమాజం లో జరిగే ప్రతీ అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రశ్నించే గుణం ఉన్న సెలబ్రిటీస్ లో ఒకరు పూనమ్ కౌర్(Poonam Kaur). రీసెంట్ గా ఆమె ట్విట్టర్ లో ఈ ఘటనపై మాట్లాడుతూ ‘ఈ నీచానికి పాల్పడిన వాడికి శిక్ష పడేంత వరకు మనం ఆ చిన్నారి తరుపున గొంతుకను వినిపిస్తూనే ఉండాలి. అనవసరమైన వాటిపై టీఆర్ఫీ రేటింగ్స్ కోసం పనికిమాలిన డిబేట్స్ నిర్వహించే మెయిన్ మీడియా, ఇలాంటి ఘటనలను మాత్రం కవర్ చెయ్యదు. అలాగే రాజకీయ నాయకులపై నాకు ఎలాంటి నమ్మకం లేదు. కాబట్టి మనమే ఇలాంటి విషయాల్లో చొరవ తీసుకోవాలి. ఆ బిడ్డకు న్యాయం జరిగేలా మాత్రమే కాదు, మళ్ళీ ఇలాంటి నీచానికి పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే స్థాయిలో మన నిరసన గళాన్ని వినిపించాలి’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే: పవన్ కళ్యాణ్
అయితే పూనమ్ కౌర్ మాట్లాడే ప్రతీ మాట పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) లను పరోక్షంగా ఉద్దేశించి కామెంట్స్ చేసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా అదే విధంగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల పై నమ్మకం లేదు అంటే ఆమె పవన్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి విషయాలపై స్పందించాలి అనే డిమాండ్ చాలా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు చాలానే జరిగాయి, కానీ ఒక్కసారి కూడా డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్న పవన్ కళ్యాణ్ స్పందించలేదు.
3 year old gets raped in #AndhraPradesh , Raise a voice untill criminal gets eliminated .
Main media won’t cover it – don’t have hopes on political leaders – only collective voice matters , do it so that there are no more victims by same animal ,
There is no justice for #RAPE.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 26, 2025