Pawan Kalyan : కేవలం నలుగురు నిర్మాతల అత్యుత్సాహం కారణం గా నేడు సినీ పరిశ్రమ ఇబ్బంది లో పడే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి(Deputy CM Pawan Kalyan) సినిమా విడుదల సమయంలో థియేటర్స్ ని మూసి వేయాలనే ఆలోచన ఇండస్ట్రీ పాలిట శాపం లాగా మారింది. అధికారికంగా సినిమా థియేటర్స్ ని మూసి వేస్తున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ, చర్చలు మాత్రం ఆ నలుగురు రెండు తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్స్ తో రహస్యం గా చాలానే జరిపారు. కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ నడవాలని, లేకపోతే ఇక మీదట థియేటర్స్ ని మూసి వేస్తామనే సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో పాకేలా చేశారు. ఈ సమస్య ఎన్నో ఏళ్ళ నుండి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ కి కోపం నషాళానికి అంటింది. ఆయన ఉగ్రరూపం ఈ రేంజ్ లో ఉంటుందని నిర్మాతలు కూడా ఊహించి ఉండరు.
Also Read : నాగార్జున 100 వ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్..అక్కినేని ఫ్యాన్స్ పెద్ద సర్ప్రైజ్!
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ బాగు కోసం నిత్యం ఆలోచించే నాకే వెన్నుపోటు పొడవాలని చూసారు. అడిగినన్ని బెనిఫిట్స్ అడిగినట్టు ఇచ్చి పరిశ్రమ పైకి ఎదిగేందుకు ప్రోత్సాహం ఇస్తే, పలువురు నాకు రిటర్న్ గిఫ్ట్ గా నా సినిమా విడుదల సమయానికి సినిమా థియేటర్స్ ని మూసి వెయ్యాలని చూసారు. రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది స్వీకరిస్తున్నాను. NDA సర్కార్ ఏర్పడి ఏడాది కావొస్తుంది. ఇప్పటి వరకు ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసారా?, గత ప్రభుత్వం సినీ రంగం వారిని ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో అప్పుడే మర్చిపోయినట్టు ఉన్నారు. ఇకపై సినీ ఇండస్ట్రీ కి చెందిన వారికి ప్రభుత్వం తో ఎలాంటి వ్యక్తిగత చర్చలు ఉండవు. సినీ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులే రావాలి’ అంటూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మీడియా కి ఒక లేఖను విడుదల చేశారు.
దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సినిమాలకు టికెట్ రేట్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. సినీ సంఘాల ప్రతినిధుల చేతుల్లో ఉంటే అంత తేలికగా పనులు అవ్వవు. అందుకే నేరుగా నిర్మాతలు ప్రభుత్వం తో మాట్లాడుకొని స్వేచ్ఛగా టికెట్ రేట్స్, అదనపు షోస్, మరియు ఇతర బెనిఫిట్స్ ని సులువుగానే తీసుకునే వారు. కానీ ఇప్పుడు అంత స్వేచ్ఛ ఉండదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. గడిచిన ఐదేళ్ళలో సినీ పరిశ్రమ కి వైసీపీ ప్రభుత్వం చుక్కలు చూపించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ కి ఎంతో అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇలాంటి సమయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి?, ఏకంగా ఉప ముఖ్యమంత్రి సినిమా విడుదలయ్యేటప్పుడు ఇలాంటి సాహసాలు చేస్తే పొలిటికల్ పవర్ లో కూర్చున్న వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా? దాని పర్యవసానాలు అనుభవించాల్సిందే. ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన పూర్తి సందేశాన్ని క్రింద అందిస్తున్నాము మీరు కూడా చూడండి.
(ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన)
తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు
•ఆంధ్రప్రదేశ్ లో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా?
•గత ప్రభుత్వం సినిమా…
— JanaSena Party (@JanaSenaParty) May 24, 2025