Nagarjuna : అక్కినేని అభిమానులు ఈ ఏడాది తండేల్ మూవీ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నారు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ కుటుంబం మొత్తం అత్యంత దయనీయమైన పరిస్థితి లో ఉన్నప్పుడు ఈ బ్లాక్ బస్టర్ పడింది. నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) హిట్ కొట్టాడు సరే, కానీ నాగార్జున(Akkineni Nagarjuna) మాత్రం తన సత్తా చాటలేకపోతున్నాడని అభిమానులు చాలా బాధపడుతున్నారు. తన తోటి సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్నారు.కానీ నాగార్జున మాత్రం వరుస డిజాస్టర్స్ తో ఫేడ్ అవుట్ అయ్యే రేంజ్ లో ఉన్నాడు. పైగా ఆయన మైండ్ సెట్ చూస్తుంటే, ఇక మీదట ఆయన వరుసగా క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అవుతాడేమో అని అభిమానుల్లో చిన్న పాటి భయం నెలకొంది. ఇప్పటికే ఆయన ధనుష్ తో ‘కుబేర’ చిత్రం, అదే విధంగా రజినీకాంత్ తో కలిసి ‘కూలీ’ చిత్రంలో నటించాడు.
Also Read : ఈ అమ్మాయి ప్రస్తుతం తెలుగులో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్.. గుర్తుపట్టడం కష్టమే..
ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన కుబేర చిత్రం లో నాగార్జున చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మల్టీ మిలినియర్ అయినటువంటి నాగార్జున కు, కటిక పేదరికం లో ఉన్న ధనుష్ కి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా. అదే విధంగా రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ’ చిత్రం లో నాగార్జున నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ ఆయన నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తుండడం తో నాగార్జున మనసు హీరో రోల్స్ నుండి క్యారక్టర్ రోల్స్ వైపు మరలిందా?, అభిమానుల ఆకలి కి తగ్గట్టుగా హీరో గా ఒక భారీ హిట్ ఇవ్వడం ఇక కష్టమేనా అని బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతం నాగార్జున తన వందవ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించనున్నాడు. అభిమానులు నాగార్జున నుండి ఎలాంటి అంశాలు కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రం లో పొందుపరిచి అక్కినేని అభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఈ సినిమాని తీర్చి దిద్దాలని అనుకుంటున్నారట. ఈ చిత్రానికి టైటిల్ ‘కింగ్ 100’ అని పెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇదే కనుక నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన 150 వ సినిమాకు ‘ఖైదీ నెంబర్ 150’ అని పెట్టుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున కూడా అదే సెంటిమెంట్ ని అనుసరిస్తుండడం తో వర్కౌట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. నాగార్జున సోలో హీరో గా భారీ బ్లాక్ బస్టర్ కొట్టినది ఊపిరి చిత్రంతో. ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన ప్రతీ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్రం తో ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్.