Pawan Kalyan Padala: అగ్నిపరీక్ష షో కి ఎన్నో వేల అప్లికేషన్స్ మధ్యలో సెలెక్ట్ అయ్యి, తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) లోకి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ పడాల(Pawan Kalyan), నెంబర్ 1 కంటెస్టెంట్ గా టైటిల్ గెలిచి బయటకు వచ్చాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి మూడు వారాలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో కనిపించేది కాదు. ఎన్నో అంచనాలు పెట్టుకొని ఇతన్ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాము, కానీ ఇతనేమో అమ్మాయిలను ఓదార్చడానికి వచ్చినట్టుగా అనిపిస్తుందే కానీ, గేమ్ ఆడేందుకు వచ్చినట్టు అనిపించడం లేదని ఆడియన్స్ సోషల్ మీడియా లో అప్పట్లో చాలా గట్టిగా మాట్లాడుకునేవారు. మూడవ వారం ఆయన ప్రియా తో పాటు ఎలిమినేషన్ రౌండ్ లోకి వచ్చాడు. ప్రియా ఎలిమినేట్ అయ్యింది , మనోడు ఎలిమినేషన్ నుండి జస్ట్ అలా తప్పించుకున్నాడు.
అలా తప్పించుకొని బయటకు వచ్చిన ఈయన, నాల్గవ వారం నుండి తన ఆట తీరు మొత్తాన్ని మార్చేసుకున్నాడు. ఫలితంగా ఎంతో మంది సెలబ్రిటీలను దాటుకొని బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ఇది ఒక ఆదర్శవంతమైన ప్రయాణం. అయితే పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన పీఆర్ టీం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పవన్ కళ్యాణ్ పడాల ని కలిపి బోలెడన్ని ఎడిటింగ్ వీడియోస్ చేశారు. అవి చూసి ఇతను పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓట్ల కోసం గేలం వేస్తున్నాడని చాలా మంది నెగిటివ్ పబ్లిసిటీ చేసాడు. కానీ నిజానికి కళ్యాణ్ పడాల పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అట. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత, ఆయన ఇంట్లో కూర్చొని ఓజీ చిత్రాన్ని చూసాడు.
అది తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో కూడా అప్లోడ్ చేసాడు. ‘కెరీర్ మీద ఫోకస్ పెట్టే ముందు, పూర్తి చేయాల్సిన తప్పనిసరి టాస్క్ ఓజీ చిత్రం చూడడం’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. బిగ్ బాస్ షో లో ఉన్నప్పుడు ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ పేరు ని వాడుకొని ఉంటాడు అనుకోవచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకొని తిరుగుతున్నదంటే నిజమైన ఫ్యాన్ కాబట్టే కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు 2024 సార్వత్రిక ఎన్నికలలో నెల్లిమర్ల జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవి గెలుపు కోసం ఈయన ఇంటింటికి తిరిగి ప్రచారం కూడా చేసాడట. అందుకే అతను బిగ్ బాస్ టైటిల్ గెలవగానే, ఎమ్మెల్యే లోకం మాధవి అతని ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలియజేసి వచ్చింది. ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో ఈ విషయాన్నీ బాగా షేర్ చేస్తున్నారు.