Pawan Kalyan- Mahesh Babu: టాలీవుడ్ లో టాప్ హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కలిసి మెలిసి ఉంటూ ఫ్యాన్స్ కు ఆదర్శంగా ఉంటున్నారు. ఒక హీరో పుట్టినరోజు నాడు కావచ్చు, సినిమా విడుదలైన రోజు కావచ్చు మరో హీరో విషెస్ చెబుతూ తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ సరికొత్త రీతిలో శుభాకాంక్షలు చెప్పడం విశేషం. మహేష్, పవన్ పబ్లిక్ లో కలిసి పెద్దగా కనిపించకపోయినా కానీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని తెలుస్తుంది. ఒకరి సినిమా కు మరొకరు విషెస్ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహేష్ బాబు నా కంటే పెద్ద నటుడు అంటూ ఎలాంటి గర్వం లేకుండా మహేష్ గురించి మాట్లాడారు.
తాజాగా మహేష్ బర్త్డే రోజు సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో విషెస్ చెప్పారు. “తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధి కి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణ గారి అడుగుజాడల్లో వెళ్తూ, విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదరసమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.” అని తెలిపారు. దీంతో మహేష్ సహా పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో కొందరు ఫ్యాన్స్ భీమ్లా నాయక్ లో లుంగీ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను, రీసెంట్ విడుదలైన మహేష్ బాబు గుంటూరు కారం లోని ఫోటోను జత చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సినిమా పరంగా వస్తే పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ విడుదలైన విషయం తెలిసిందే, ఆ తర్వాత ఉస్తాద్, OG సినిమాలు రాబోతున్నాయి. మరోపక్క మహేష్ బాబు గుంటూరు కారం లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ సినిమాలో నటించబోతున్నాడు.