Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా విన్నూతన పద్ధతుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. దేశం లోనే ఎక్కడా లేని విధంగా 13 వేలకు పైగా గ్రామాల్లో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డుని నెలకొల్పిన పవన్ కళ్యాణ్, గ్రామా సభల్లో ఎంచుకోబడిన సమస్యలను పరిష్కరించేందుకు ‘పల్లె పండుగ’ అనే ప్రోగ్రాం ని మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో రోడ్లు, వీధి లైట్లు, నీటి సదుపాయాలు, పంట కాలువలను నిర్మించడం, నీటి కుంటలు ఏర్పాటు చేయడం, గోకులాలను నిర్మించడం, ఇలా గ్రామాలకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన నిర్వహించాడు. అయితే త్వరలోనే ఆయన జిల్లాల పర్యటన చేసి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే.
సాధారణ రాజకీయ నాయకులు అయితే ఈ కార్యక్రమాన్ని సులువుగా నిర్వహించగలరు. కానీ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ కి చెందిన ఒక పెద్ద సూపర్ స్టార్. ఆయన రోడ్డు మీదకు వస్తే కచ్చితంగా యువత బారులు తీస్తారు. ప్రభుత్వ యంత్రాంగానికి బోలెడంత తలనొప్పి, ఎంతో ఖర్చుతో కూడుకున్న పనులు కూడా. అందుకే ఆయన వెండితెర ద్వారా ‘మన ఊరు కోసం మాటామంతి’ అనే కార్యక్రమాన్ని తెలపెట్టాడు. గ్రామాల్లో ఉండే థియేటర్స్ లో ప్రజలతో ఆయన వర్చువల్ గా ఇంటరాక్ట్ అవుతాడు. వాళ్ళ సమస్యలను వెండితెర నుండే అడిగి తెలుసుకుంటాడు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన పేషీకి సంబంధించిన అధికారులు కూడా ఉంటారు. ఇక థియేటర్ లో అయితే ఆ జిల్లాకు చెందిన కలెక్టర్ తో పాటు, మిగిలిన ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. ప్రజలు చెప్పే సమస్యలను అక్కడికక్కడే రాసుకొని దానికి పరిష్కార మార్గం చూపిస్తారు. ఇలాంటి విన్నూత కార్యక్రమం ఇప్పటి వరకు దేశం లో ఎక్కడా జరగలేదు.
Also Read : పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్!
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో విడుదలై బాగా వైరల్ అయ్యాయి. సినిమాల్లోనే కాదు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా సరికొత్త ట్రెండ్ ని నెలకొల్పాడు అంటూ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా సెల్యూట్ చేస్తున్నారు. నేడు తొలుత శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని రావివలస గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడి ప్రజలతో థియేటర్ ద్వారా మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించాడు పవన్ కళ్యాణ్. ప్రజలు వారి సమస్యలను చెప్పుకోవడానికి కార్యాలయాలు చుట్టూ తిరగకుండా, పర్చువల్ గా గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించడం తో ప్రజా సమస్యలు పరిష్కారానికి సులభతరం అవుతుందని, ఈ వినూత్న విధానం ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలు అందుతాయని ఆశిస్తున్నాము అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ కార్యక్రమం ఇలాగే ముందుకు వెళ్తుందా, లేకపోతే మధ్యలోనే ఆపేస్తారా అనేది.
From "Cut… Action!" to "Go… Implement!"
Now,
his scripts are policies,
his co-stars are citizens,
and his box office is public trust.No retakes here-every decision impacts lives in real time.
Andhra Pradesh Deputy CM @PawanKalyan pic.twitter.com/ugzNfOLsiM
— HHVM on June12th (@VinayakJSP_) May 22, 2025