OG Movie Twists: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఖాళీగా ఉన్న థియేటర్స్ కి ఈ చిత్రం కచ్చితంగా ఊపిరి పోస్తుంది అనే ఆశ అందరిలోనూ ఉంది. ముఖ్యంగా సింగల్ స్క్రీన్ థియేటర్స్ బ్రతకాలంటే ఓజీ సినిమా రావాల్సిందే అనే రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి, ‘ఫైర్ స్ట్రోమ్’ లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఫైర్ స్ట్రోమ్ పాట అయితే ఇప్పటికీ అన్ని మ్యూజిక్ ఛార్ట్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈమధ్య కాలం లో ఒక పాటకు ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని ఏ సినిమాకు చూడలేదని అంటున్నారు నెటిజెన్స్.
Also Read: ఖైదీ 2′ ని పక్కన పెట్టిన లోకేష్ కనకరాజ్..క్రేజీ మల్టీస్టార్రర్ వైపు మొగ్గు!
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రం లోని హీరోయిన్ పోస్టర్ ని విడుదల చేసి రెండవ పాట ప్రోమో అతి త్వరలోనే విడుదల చేయబోతున్నామని మేకర్స్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం తో ఫ్యాన్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మొదటి నుండి ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ ఒక రూమర్ విపరీతంగా ప్రచారం అయ్యింది. అయితే అది కేవలం ప్రచారం గానే చూశారు కానీ, అందులో ఎలాంటి నిజం లేదని అధికారికంగా ఓజీ టీం తెలిపింది. కానీ ఇందులో అకిరా నందన్ ఉన్నాడని, ఆయన మీద పలు సన్నివేశాల షూటింగ్ కూడా జరిగిందని మరోసారి ఫిల్మ్ నగర్ లో బలంగా వినిపిస్తున్న వార్త.
వివరాల్లోకి వెళ్తే ‘ఓజీ’ అంటే అర్థం ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ క్యారక్టర్ పేరు ‘ఓజాస్ గంభీర’, అందుకే ఓజీ టైటిల్ పెట్టామని డైరెక్టర్ సుజిత్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అయితే ఓజాస్ గంభీర తర్వాత ఆయన సామ్రాజ్యానికి ఒక వారసుడు ఉంటాడని, అతనికి శత్రువుల పట్ల జాలీ, దయ, కరుణ వంటివి ఏమి ఉండవని, అతన్ని అందరూ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారని, క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ ని రెవీల్ చేస్తారట. ఆ ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ మరెవరో కాదు, అకిరా నందన్ అని ఆయనకు సంబంధించిన క్లోజప్ షాట్ తో సినిమా ముగుస్తుందని, పార్ట్ 2 మొత్తం అకిరా నందన్ మీదనే ఉంటుందని, పవన్ కళ్యాణ్ కేవలం స్పెషల్ రోల్ లో మాత్రమే కనిపిస్తాడని ఒక టాక్ ఉంది. ఇదే నిజమైతే థియేటర్స్ లో ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో, మెంటలెక్కిపోతారేమో చూడాలి.