Shriya Reddy Comments On Pawan Kalyan: మరో రెండు వారాల్లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఓజీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు మొదటి నుండి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ చాలా కాలం తర్వాత రీ మేక్ సినిమాలను పక్కన పెట్టి, నేటి తరం యూత్ ఆడియన్స్ ఇష్టపడే యాక్షన్ సినిమాని సుజిత్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో చేయడం వల్లే ఈ సినిమాకు అంతటి క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అద్భుతంగా పేలింది. ముఖ్యంగా గ్లింప్స్ వీడియో, అదే విధంగా ఫైర్ స్ట్రోమ్ పాట యూత్ ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేయడం కూడా ఈ సినిమా పై హైప్ ని తారాస్థాయికి తీసుకెళ్లేలా చేశాయి. ఇక పోతే ఈ చిత్రం లో ప్రియాంక అరుళ్ మోహనన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
Also Read: ‘కిష్కిందపురి’ మూవీ టాక్ వచ్చేసింది… ఏంటి భయ్యా మరీ ఇలా ఉంది…
ఆమెతో పవన్ కళ్యాణ్ డ్యూయెట్ సాంగ్ ‘సువ్వి సువ్వి’ రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని కూడా సొంతం చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సోదరి పాత్ర లో ‘పొగరు’ ఫేమ్ శ్రీయా రెడ్డి నటించింది. ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పని చేసిన అనుభవాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఓజీ నా జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చింది. ఆ సినిమాలో పని చేసిన డైరెక్టర్, నిర్మాత మరియు ప్రతీ టెక్నీషియన్ కూడా ఎంతో అద్భుతమైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ చాలా గొప్పవారు. ఆయనతో పని చేస్తున్నప్పుడే అర్థమైంది , ఎందుకు జనాలు ఆయన్ని అంతలా ఇష్టపడతారో అని’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఓజీ లో ఆమె క్యారక్టర్ గురించి మాట్లాడుతూ ‘ఓజీ లో నా క్యారక్టర్ చాలా ఇంటెన్స్ గా, రియలిస్టిక్ గా ఉంటుంది. ఈ సినిమాలో నా లుక్ దగ్గర నుండి, చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసాడు డైరెక్టర్ సుజీత్. అందులో నాలో నాకు తెలియని టాలెంట్ కూడా బయటపడింది. ఇలాంటి అడ్వెంచర్ తో కూడిన రోల్స్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రం లో నా క్యారక్టర్ కి మంచి క్రేజ్ దొరుకుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీయ రెడ్డి. మరి ఆమె చెప్పినట్టుగా ఉందో లేదో ఈ సినిమా విడుదలయ్యాక చూద్దాం.