Music Directors Viral Tweet Explained: గత రెండు మూడు రోజుల నుండి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్(Anirudh Ravichander), కావ్య మారన్(Kavya Maran) లు ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అంటూ సోషల్ మీడియా లో అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. టాప్ మోస్ట్ నేషనల్ మీడియా కూడా ఈ వార్తలకు కవరేజ్ ఇవ్వడం తో అందరూ నిజమనే అనుకున్నారు.
కానీ కాసేపటి క్రితమే అనిరుద్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ రూమర్స్ పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ఏంటి..నాకు పెళ్లా? అందరూ శాంతించండి..అలాంటిదేమి లేదు..దయచేసి రూమర్స్ ని వ్యాప్తి చేయకండి’ అంటూ చెప్పుకొచ్చాడు. అనిరుద్ ఈ క్లారిటీ ఇవ్వడం తో ఒక్కసారిగా రూమర్స్ కి చెక్ పడ్డాయి. కానీ ఆయన కేవలం పెళ్లి గురించి మాత్రమే క్లారిటీ ఇచ్చాడు..ప్రేమ గురించి ఇవ్వలేదు కదా?, ఇద్దరు లివింగ్ రిలేషన్ లో లేరని గ్యారంటీ ఏంటి అంటూ సోషల్ మీడియా లో మరో టాక్ వినిపిస్తుంది.
ఇంత బలంగా వీళ్ళ మధ్య రిలేషన్ ఉంది అనడానికి ప్రధాన కారణం వీళ్లిద్దరు కలిసి ఒక ప్రైవేట్ పార్టీ లో కనిపించడమే. దీనిని తమిళ మీడియా ఒక రేంజ్ లో వ్యాప్తి అయ్యేలా చేసింది. అప్పటి నుండే ఈ రూమర్స్ కి పునాది పడింది. అనిరుద్ సైతం రియాక్ట్ అయ్యేలా చేసిందంటే ఏ రేంజ్ లో ఈ వార్త వైరల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. కావ్య మారన్ అంటే తెలియని వాళ్లంటూ ఎవ్వరూ లేరు. ఈమె లెజెండ్ కళానిధి మారన్ కూతురు.
అంతే కాదు మన అందరికీ ఎంతో ఇష్టమైన IPL టీం సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఓనర్ కూడా. SRH మ్యాచ్ సమయం లో ఈమె స్టేడియం లో ఆడియన్స్ వద్ద కూర్చొని ప్రతీ బాల్ కి ఇచ్చే రియాక్షన్ కి సోషల్ మీడియా లో మామూలు రేంజ్ రెస్పాన్స్ వచ్చేది కాదు. అలాంటి క్రేజీ సెలబ్రిటీ, ఇండియా లోనే నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుద్ తో పెళ్లి అనే రూమర్ వస్తే ఆ మాత్రం వైరల్ అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అనిరుద్ క్లారిటీ ఇచ్చాడు కదా.. ఈ రూమర్స్ కి ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూద్దాం.