ఎంటర్టైన్మెంట్Jailer Child Artist: ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ మనువడిగా నటించిన ఈ బుడ్డోడు ఎవరు?...

Jailer Child Artist: ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ మనువడిగా నటించిన ఈ బుడ్డోడు ఎవరు? ఈ అవకాశం ఎలా వచ్చిందో తెలుసా?

Jailer Child Artist: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ ప్రభంజనం సృష్టిస్తోంది. పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగులోనూ బెస్ట్ మూవీగా నిలిచింది. రజనీకాంత్ హిట్టు, ఫట్టు లేకుండా సినిమాలు తీస్తున్నారు. తాజాగా ‘జైలర్ ’కు వచ్చిన రెస్పాన్స్ ఇదివరకు వచ్చిన సినిమాలకు రాలేదని కొందరు అంటున్నారు. ఈ తరుణంలో ఈ సినిమా సన్నివేశాలు, నటుల గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలో నటించిన బాలనటుడి గురించి ఆరా తీస్తున్నారు. క్యూట్ గా ఉన్న ఈ అబ్బాయి రజనీకాంత్ కు మనువడి పాత్రలో నటించారు. అయితే ఆ బాలనటుడికి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఉందన్న విషయం తెలిస్తే షాక్ అవుతారు. అంతేకాకుండా ‘జైలర్’ కంటే ముందే రెండు స్టార్ల సినిమాల్లో నటించారు. మరి ఈ బుడ్డోడి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

జైలర్ సినిమాలో రజనీకాంత్ తో పాటు చాలా మంది స్టార్ నటులు ఉన్నారు. మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడం నుంచి శివరాజ్ కుమార్,తెలుగు నుంచి సునీల్ తదితర స్టార్లు నటించారు. ఇక ఇందులో రజనీకాంత్ కు భార్యగా రమ్యకృష్ణ నటించారు. ఆయన కుమారుడిగా హీరో వసంత్ రవి, కోడలిగా మిన్నా మేనన్ నటించారు. వీరికి కుమారుడు అంటే రజనీకాంత్ కు మనువడిగా నటించిన అబ్బాయి పేరు రిత్విక్. ఈయన పిట్ట కొంచెం కూత ఘనం టైపు. ఎందుకంటే రిత్విక్ ను.. రిత్విక్ రాక్స్ అని పిలుస్తారు. అలా పిలవడానికి ఓ కారణం ఉంది.

‘రిత్విక్ రాక్స్ ’ పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఇందులో రిత్విక్ కు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఇందులో రిత్విక్ డ్యాన్స్ తో పాటు కామెడీ వీడియోలు కూడా చేశారు. తన తండ్రి జ్యోతిరాజ్ ఈ ఛానెల్ బాధ్యతలను చూసుకుంటాడు. రిత్విక్ చేసిన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ఈ ఛానెల్ ను పాలో అయ్యేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. 2023 ఆగస్టు నాటికి రిత్విక్ రాక్స్ 2.36మిలియన్ సబ్ స్క్రైబర్లుగా మారిందంటే మాములు విషయం కాదు. మిగతా సోషల్ మీడియాల్లోనూ రిత్విక్ వీపరీత ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు.

ఇలా తన వీడియోల ద్వారా పేమస్ కావడంతో ఆయనకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ‘జైలర్’ కంటే ముందు రిత్విక్ స్టార్ల సినిమాల్లో నటించారు. నయనతార నటించిన 02(ఆక్సిజన్) అనే సినిమాలో ఆమె కొడుకుగా నటించారు. ఆ తరువాత కార్తీ హీరోగా వచ్చిన ‘సర్దార్’ సినిమాలో లైలా కొడుకుగా నటించాడు. ఈ రెండు సినిమాల్లో తన ఫర్ఫామెన్స్ చూపించడంతో రిత్విక్ కు ‘జైలర్’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ మనువడిగా నటించే అవకాశం వచ్చింది. చిన్నవయసులోనే సంచలనాలు సృష్టిస్తున్న రిత్విక్ ముందు ముందు ఎలాంటి సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version