OG Movie Hype Increased: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి (OG) సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే సుజీత్ ఈ సినిమాని తెరకెక్కించి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా ఈ సినిమాను నిలపాలనే ఉద్దేశ్యంతో సుజిత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన సుజిత్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఎక్కువగా బిజీ అయిపోయాడు. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని మాట ఇచ్చిన సుజీత్ ఆ తేదిన ఈ సినిమాను పర్ఫెక్ట్ గా సినిమాను డెలివరీ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు దొరికితే సుజిత్ ఆకాశమే హద్దుల చెలరేగిపోయి మంచి సక్సెస్ ఫుల్ సినిమాని చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఓజీ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఓజీ పైనే ప్రతి ఒక్కరి చూపు ఉంది.
Also Read: గౌతమ్ గంభీర్ కాదు.. టీమిండియా కు .. రవి శాస్త్రి, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లే కావాలిప్పుడు!
మరి ఈ సినిమాతో సుజీత్ ఎలాంటి సక్సెస్ ని అందిస్తాడు. పవన్ కళ్యాణ్ అభిమానుల కలను నెరవేరుస్తూ పవన్ కళ్యాణ్ ను వేరే రేంజ్ లో చూపిస్తాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… ఇక సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లలో పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి మామూలుగా ఉండదు.
ఒక రకంగా చెప్పాలంటే థియేటర్లు మొత్తం తగలడిపోతాయి అంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో సుజీత్ కనక ఈ సినిమాతో సక్సెస్ ని అందిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు అతన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.
ఒకవేళ కనక తేడా కొడితే మాత్రం సుజీత్ మీద భారీ విమర్శలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే తను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి ఈ సినిమాని డీల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందా? తద్వారా సుజీత్ స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడా? లేదా అనేది కూడా ఈ సినిమా రిజల్ట్ మీదనే ఆధారపడి ఉంది…