Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ లో నిల్చోబెట్టాయి. గత సంవత్సరం వచ్చిన ఓజీ సినిమాతో పలు రికార్డులను క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రాజకీయ రంగంలో బిజీగా ఉన్నప్పటికి సినిమాలను సైతం ఎక్కడ వదిలిపెట్టకుండా అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…ఇక పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లో ఉన్న కొంత మందితో చాలా క్లోజ్ గా ఉంటాడు.
Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!
కానీ మరి కొంతమంది తో తను మాట్లాడటం లేదనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ నటులు ఎవరు అనేదానిమీద కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయన పోసాని కృష్ణమురళితో అసలు మాట్లాడటం లేదట. గతంలో పోసాని పవన్ కళ్యాణ్ ను అతని ఫ్యామిలీని అతని కూతుర్లను ఉద్దేశించి చాలా బ్యాడ్ కామెంట్స్ చేశాడు.
దాంతో తనని సినిమాల్లోకి కూడా ఎవరు తీసుకోవడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ సైతం పోసాని కృష్ణ మురళి ని చాలా వరకు దూరంగా పెట్టారట. అతనితో పాటుగా అలీని సైతం పవన్ కళ్యాణ్ దూరంగా ఉంచుతున్నాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అలీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టిన తర్వాత అలీ వైసీపీ పార్టీలో చేరడం పవన్ కళ్యాణ్ మీద కొన్ని కామెంట్లు చేయడం అతన్ని తీవ్రంగా ఇబ్బందికి గురి చేశాయి. దాంతో అతనితో కూడా మాట్లాడటం లేదట.
ఇక మరి కొంతమంది నటులతో సైతం ఆయన మాట్లాడడం లేదనే వార్తలైతే వస్తున్నాయి… ఇక ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఏ రేంజ్ లో సాధిస్తాయని తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
