Pawan Kalyan-Nidhi Agarwal : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా నిధి అగర్వాల్(Nidhi Agarwal) పేరు ఉంటుంది. ఈమె 2018 వ సంవత్సరం లో ‘సవ్యసాచి’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. మొదటి సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ యూత్ ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆ చిత్రం ద్వారా ఈమెకు వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని మొదటి సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా మేకర్స్ ఈమెకు అవకాశాలు ఇచ్చారు. అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ, పాపం ఈ హాట్ బ్యూటీ కి హిట్స్ కరువు అయ్యాయి. ఈమె కెరీర్ మొత్తం మీద కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘డబుల్ ఇష్మార్ట్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈమె హిట్ చూడలేదు.
Also Read : మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?
అయినప్పటికీ ఈమెకు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సరసన ‘హరి హర వీరమల్లు'(Hari Hara VeeraMallu), ప్రభాస్(Rebel star Prabhas) సరసన ‘ది రాజాసాబ్'(The Rajasaab) చిత్రాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దొరికింది. వీటిల్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధం అవ్వబోతుంది. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అభిమానులు నిధి అగర్వాల్ ని ప్రత్యేకించి అభిమానిస్తుంటారు. ఎందుకంటే ‘హరి హర వీరమల్లు’ మూవీ విషయం లో మొదటి నుండి ప్రొమోషన్స్ లో ఫుల్ యాక్టీవ్ గా ఉండేది ఈమె మాత్రమే కాబట్టి. రెండు మూడు సార్లు అభిమానులతో ఈమె ఇంటరాక్ట్ కూడా అయ్యింది. అయితే రీసెంట్ గా ఈమె ఒక పూజా కార్యక్రమం లో నిమగ్నమై ఉండడాన్ని చూసి నిధి అగర్వాల్ సనాతన ధర్మం పాటించడం లో ఎప్పుడూ ముందు ఉంటుంది అంటూ ఆమె అభిమానులు పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ కామెంట్స్ పోస్టులు వేస్తున్నారు.
మొదటి నుండి నిధి అగర్వాల్ కి దైవ భక్తి ఎక్కువే. జాతకాలను, జ్యోతిష్యాలను కూడా ఈమె బాగా నమ్ముతుంది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన వేణు స్వామి వద్ద కూడా ఈమె ఎన్నో పూజలు చేయించింది. వరుసగా తనకు ఫ్లాప్స్ వస్తున్నా కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం వస్తుందంటే, అందుకు కారణం దైవ సంకల్పమే అని నిధి అగర్వాల్ బలంగా నమ్ముతుంది. ఆమెలో ఉన్న ఈ దైవ భక్తి కూడా పవన్ అభిమానులు బాగా నచ్చింది. ఇలా అన్నీ అంశాల్లోనూ ఈమె సోషల్ మీడియా లో నెటిజెన్స్ కి బాగా దగ్గర అవుతుంది. కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ ఇంకోటి పడితే ఈమె రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్ళిపోతుంది. మరి ఆ స్థాయికి ఈమె వెళ్తుందా లేదా అనేది వచ్చే నెలలో విడుదలయ్యే ‘హరి హర వీరమల్లు’ తో తేలిపోనుంది.
Sanatani Heroine #NidhhiAgerwal following the sanatani dharma ❤️
A Devotional vibe without these two we can't imagine #HariHaraVeeraMallu#VeeraMallu #DharmaBattle pic.twitter.com/ruLeoaGE2t
— WORLD CUP FOLLOWER (@BiggBosstwts_) May 23, 2025