https://oktelugu.com/

‘విరూపాక్ష’ కాదట.. ‘గజదొంగ’ లేదంటే ‘బందిపోటు’!

రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇంత విరామం తర్వాత ఆయన ‘వకీల్ సాబ్’ తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బోనీ కపూర్, దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 18, 2020 / 05:43 PM IST
    Follow us on


    రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇంత విరామం తర్వాత ఆయన ‘వకీల్ సాబ్’ తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బోనీ కపూర్, దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌ గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నా.. చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయలేదు. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. ఇప్పట్లో షూటింగ్‌ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. దాంతో, క్రిష్‌ జాగర్లమూడితో పవన్‌ ఇప్పటికే కమిటైన మూవీపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కథ, కథనంపై కసరత్తులు చేస్తున్నారట. అయితే, ఈ మూవీ గురించి తాజాగా ఓ విషయం బయటికొచ్చింది. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కబోయే ఈ మూవీకి ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ను ఎంచుకున్నారని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు మరో రెండు పేర్లు తెరపైకి వచ్చాయి.

    Also read :- RGV releases first look of ‘Power Star’

    ఈ చిత్రానికి ‘గజదొంగ’, లేదంటే ‘బందిపోటు’ అనే టైటిల్‌లో దేన్నో ఒకదాన్ని ఖారారు చేయాలని చిత్రబృందం భావిస్తోందని సమాచారం. కథానుసారం ఈ రెండింటిలో ఒకటైతేనే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం. కాగా, ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే కొంత షూటింగ్‌ కూడా జరిగిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన పవర్ కళ్యాణ్‌ బర్త్‌డేని పురస్కరించుకొని మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ టీజర్ను కూడా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్ క్రిష్‌, నిర్మాతలు భావిస్తున్నారట. దానికి సంబంధించే కొన్ని రోజులు షూటింగ్‌ నిర్వహంచారని టాలీవుడ్‌ టాక్‌. అయితే, గతంలో టైటిల్స్‌ నచ్చక పవన్‌ కొన్ని సినిమాలు వదులుకున్నాడు. అలాంటి వ్యక్తి ‘గజదొంగ’ లేదా ‘బందిపోటు’ అలాంటి నెగెటివ్‌ టైటిల్‌కు ఒప్పుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.