https://oktelugu.com/

అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా… కంగనా సవాల్‌

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత సినీ పరిశ్రమలో నెపోటిజంపై చర్చ నడుస్తోంది. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే పరిశ్రమలో నెపోటిజంపై అనేక విమర్శలు చెలరేగాయి. ప్రధానంగా మహేష్‌ భట్‌, కరన్‌ జోహార్‌, సల్మాన్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులపై పలువురు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు సైతం నెపోటిజంపై గళమెత్తారు. బాలీవుడ్‌ క్వీన్, ఫైర్బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్‌ అయితే మహేష్‌ భట్‌, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 18, 2020 / 05:33 PM IST
    Follow us on


    బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత సినీ పరిశ్రమలో నెపోటిజంపై చర్చ నడుస్తోంది. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే పరిశ్రమలో నెపోటిజంపై అనేక విమర్శలు చెలరేగాయి.

    ప్రధానంగా మహేష్‌ భట్‌, కరన్‌ జోహార్‌, సల్మాన్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులపై పలువురు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు సైతం నెపోటిజంపై గళమెత్తారు. బాలీవుడ్‌ క్వీన్, ఫైర్బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్‌ అయితే మహేష్‌ భట్‌, కరన్‌పై నేరుగా తీవ్ర విమర్శలు చేసింది. తాను కూడా బంధుప్రీతి బాధితురాలినే అని చెప్పింది.

    అలాగే సుశాంత్‌ మరణంపై మరికొందరితో పాటు ఆమె కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. సుశాంత్‌ది ఆత్మహత్యా లేక పథకం ప్రకారం జరిగిన హత్యా? అని ప్రశ్నించింది. సుశాంత్‌ చనిపోయి నెల రోజులు పూర్తయినా.. ఈ వివాదం సర్దుమనగడం లేదు. ప్రతి రోజూ ఎవరో ఒకరు సుశాంత్‌ మరణాన్ని, నెపోటిజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.

    Also read :- War of words between Kangana Ranaut and Pooja Bhatt

    తాజాగా కంగనా రనౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తన వాదనలను నిరూపించుకోలేకపోతే తన పద్మశ్రీని పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించింది. ఒక హిందీ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కంగనా ఈ సవాల్ విసిరింది.

    సుశాంత్‌ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు తాను మనాలీలో ఉండగా ఫోన్‌ చేశారని చెప్పింది. అయితే తన స్టేట్‌మెంట్‌ను తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా ఎవరూ రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని వెల్లడించింది. ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడనని, తాను పారిపోయే మనషిని కాదని కంగనా స్పష్టం చేసింది.

    సుశాంత్‌ మరణం విషయంలో తన విమర్శలను నిరూపించు కుంటునానని చెప్పింది. ఒకవేళ నిరూపించుకోలేకపోతే, పద్మశ్రీ అవార్డును ఉంచుకునే అర్హత తనకుండదని కంగనా పేర్కొంది.

    Also read:- Kangana About Jayalalitha biopic