Pawan Kalyan Upcoming Movies: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరు ఏ రేంజ్ లో వినిపిస్తుందో మనం ప్రతీ రోజు మీడియా , సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా , పంచాయితీ రాజ్ మరియు పర్యావరణ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ప్రతీ అడుగులోనూ ఆయన తన మార్క్ చూపిస్తున్నాడు. లేటెస్ట్ గా ఆయన పంచాయితీ రాజ్ శాఖకు 5 నేషనల్ అవార్డ్స్ వచ్చేలా చేశాడు. దేశం లో ఏ రాష్ట్రంలో కూడా ఈ రేంజ్ అభివృద్ధి జరగడం లేదనేది వాస్తవం అని చెప్పొచ్చు. అంతే కాదు , పవన్ కళ్యాణ్ లుక్స్ పరంగా కూడా ప్రస్తుతం పీక్ రేంజ్ లో ఉన్నాడు. ఆయన లేటెస్ట్ లుక్స్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్స్ ని చూసిన అభిమానులు, ఆయన తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నాడని , అందుకే తన లుక్స్ ని ఈ రేంజ్ లో మార్చున్నాడని అనుకున్నారు. అలా అభిమానుల ఆనందానికి సోషల్ మీడియా లో లేటెస్ట్ గా జరుగుతున్న ఒక ప్రచారం చెక్ పెట్టింది. పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గానే డైరెక్టర్ సురేందర్ రెడ్డి పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ని రెడీ చేసి వినిపించాడని , కానీ పవన్ కళ్యాణ్ అందుకు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని, కాబట్టి సురేందర్ రెడ్డి తో సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ 2’ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా రీసెంట్ గానే సుజిత్ పూర్తి చేశాడని తెలుస్తోంది. జనవరి నుండి ఈ చిత్రాన్ని మొదలు పెడతాడని అంతా అనుకున్నారు.
కానీ అది సాధ్యం అయ్యేలా అనిపించడం లేదని అంటున్నారు విశ్లేషకులు. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఎలాంటి సినిమా కమిట్మెంట్స్ ఇచ్చే మూడ్ లో లేడని, ఆయన ద్రుష్టి మొత్తం ఇప్పుడు పాలన మీదనే ఉందని, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి , ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ ఈ పుష్కరాల బాధ్యతని తన భుజాల మీద వేసుకున్నాడని , ప్రపంచం మొత్తం ఈ పుష్కరాల గురించి అద్భుతంగా మాట్లాడుకునే చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని, ఆ మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే వరకు ఆయన ఎలాంటి సినిమా కమిట్మెంట్స్ ని ఒప్పుకునే పరిస్థితి లో లేడని సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.
