https://oktelugu.com/

Pawan Kalyan- Surender Reddy: యథా కాలమ్ తథా వ్యవహారమ్’… సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మూవీ!

వక్కంతం వంశీ కథ అందిస్తుండగా 'యథా కాలమ్ తథా వ్యవహారమ్' అని పోస్టర్ పై రాసి ఉంది. ఆ కోట్ చూస్తే పరిస్థితులు, కాలం ఆధారంగా నడుచుకోవాలనే అర్థం గోచరిస్తుంది. అలాగే కాలాన్ని బట్టి మనుషులు, వాళ్ళ పనులు ఉంటాయనే అర్థం కూడా స్పృశిస్తుంది.

Written By:
  • Shiva
  • , Updated On : September 2, 2023 1:07 pm
    Pawan Kalyan- Surender Reddy

    Pawan Kalyan- Surender Reddy

    Follow us on

    Pawan Kalyan- Surender Reddy: నేడు పవన్ కళ్యాణ్ జన్మదినం కాగా… ఆయన అప్ కమింగ్ చిత్రాల అప్డేట్స్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతున్నాయి. పవన్ బర్త్ డే పురస్కరించుకుని హరి హర వీరమల్లు నుండి పోస్టర్ విడుదల చేశారు. దర్శకుడు సుజీత్ తో చేస్తున్న ఓజీ టీజర్ విడుదలైంది. ఈ రెండు అప్డేట్స్ గూస్ బంప్స్ రేపాయి. కాగా నేడు పవన్ కళ్యాణ్ కొత్త మూవీ ప్రకటన చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మాతగా ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ క్యూరియాసిటీ పెంచింది. చిత్ర కథపై హింట్ ఇచ్చేలా ఉంది.

    వక్కంతం వంశీ కథ అందిస్తుండగా ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ అని పోస్టర్ పై రాసి ఉంది. ఆ కోట్ చూస్తే పరిస్థితులు, కాలం ఆధారంగా నడుచుకోవాలనే అర్థం గోచరిస్తుంది. అలాగే కాలాన్ని బట్టి మనుషులు, వాళ్ళ పనులు ఉంటాయనే అర్థం కూడా స్పృశిస్తుంది. మొత్తంగా ఇదో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ అనిపిస్తుంది. కాగా ఈ కాంబినేషన్ చాలా కాలం క్రితమే ప్రకటించారు.

    2019లో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ప్రకటించారు. అప్పుడు వకీల్ సాబ్, హరి హర వీరమల్లుతో పాటు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక మూవీ ప్రకటించడం జరిగింది. ఇదే నిర్మాత రామ్ తళ్లూరి నిర్మించాల్సి ఉంది. అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యింది. మరి గతంలో అనుకున్న కథతోనే ప్రాజెక్ట్ చేస్తున్నారా లేక కొత్త కథ అనేది క్లారిటీ లేదు. అప్పుడు వక్కంతం పేరు ప్రకటించినట్లు లేరు. అదే సమయంలో ఇది విక్రమ్ వేద రీమేక్ అనే ప్రచారం కూడా జరిగింది.

    తాజా సమాచారం ప్రకారం ఇది స్ట్రెయిట్ మూవీ. రీమేక్ కాదంటున్నారు. నేడు ప్రకటన పోస్టర్ విడుదల చేశారు. ఇతర నటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ మొదలవుతుందని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ఓజీ, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయాల్సి ఉంది. మరి సురేందర్ రెడ్డి మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది చూడాలి…