Jamili Elections : దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్రం కసరత్తు చేస్తోంది. జమిలీ ఎన్నికలకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో సాధ్యం కాదు అని తేలిపోయింది. పార్లమెంట్ సెషన్ 18-22 వ తేదీల ప్రత్యేక సమావేశం కశ్మీర్ బిల్లుల కోసం అని అంటున్నారు. అయితే మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అధ్యక్షతన ‘ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అన్న దానిపై కమిటీ ఏర్పాటు చేశారు. మెంబర్లను అపాయింట్ చేయాల్సి ఉంది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ, ఎన్నికలకు కావాల్సిన అనుకూలతపై సర్వే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిపోర్ట్ ఇస్తే జమిలీ ఎన్నికలపై కేంద్రం ముందుకు వెళుతుంది.ఇదంతా ఈ దఫాలో అయితే కాని పని. వచ్చే ఐదేళ్లలో పూర్తి కావచ్చు.
అయితే ఇవాళ ఒకవైపు సీఎంలు నితీష్ కుమార్, మమతా బెనర్జీ లు మీటింగ్ లలో ‘ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతోందని చెబుతున్నారు. చెప్పలేం.. బ్యూరోక్రసీలోని కాంటాక్టులతో వాళ్లు చెప్పింది నిజమే కావచ్చు. హెలిక్యాప్టర్లను బీజేపీ భారీగా బుక్ చేయడం వెనుక కూడా ఇదే కారణం కావచ్చు.
మోడీ నిర్ణయం తీసుకుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. పార్లమెంట్ తో సంబంధం లేకుండా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే ఎన్నికలకు వెళ్లొచ్చు. లోక్ సభతోపాటు 12 అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలకు వెళ్లొచ్చు.
పార్లమెంట్ చట్టాలు, నిబంధనలు లేకుండానే 12 రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లొచ్చు. దీనిపైనే కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.