Bigg Boss 8 Telugu Exclusive : పూర్తి అయిన బిగ్ బాస్ 8 షూటింగ్.. నేడు హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వీళ్ళే!

హౌస్ లోకి అడుగుపెట్టే ముందు కంటెస్టెంట్స్ తో పలు టాస్కులు ఆడించి నాగార్జున లోపలకు పంపినట్టు తెలుస్తుంది. ఈ సీజన్ లో సెలెబ్రిటీలకంటే ఎక్కువగా కొత్త వాళ్ళే కనిపించనున్నారు. చూడాలి మరి ఈ సీజన్ గత సీజన్ లాగా పెద్ద హిట్ అవుతుందా, లేదా సీజన్ 6 లాగా ఫ్లాప్ అవుతుందా అనేది.

Written By: NARESH, Updated On : August 31, 2024 10:15 pm

Bigg Boss 8 Telugu(4)

Follow us on

Bigg Boss 8 Telugu : కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 8 రేపటి నుండి గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సీజన్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో ప్రతీ రోజు సోషల్ మీడియా హంగామాతో నిండిపోతుంది. ఏడాది నుండి ఖాళీగా ఉన్నటువంటి యూట్యూబ్ చానెల్స్ మళ్ళీ యాక్టీవ్ కానున్నాయి. ప్రతీ రోజు కంటెస్టెంట్స్ రివ్యూస్ తో యూట్యూబర్లు సందడి చేయనున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ సోషల్ మీడియా లో ప్రతీ రోజు పలు రకాల కథనాలు వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మొదట్లో వినిపించిన పేర్లు, తర్వాత వినబడేవి కాదు. ప్రేక్షకులను ఈ లిస్ట్ తెగ తికమక పెట్టేసింది. అయితే నేడు బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసారు.

ఈ ఎపిసోడ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వివరాలను ఇప్పుడు మేము మీ ముందు పెట్టబోతున్నాము.

1) ఆదిత్య ఓం & నిఖిల్ :

మొదటి నుండి మనం వింటున్నట్టుగానే ఈ సీజన్ లోకి కంటెస్టెంట్స్ గా హీరో ఆదిత్య ఓం, సీరియల్ హీరో నిఖిల్ నేడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేసారు.

2) ప్రేరణ :

సీరియల్ హీరోయిన్ ప్రేరణ కూడా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఈమె స్టార్ మా ఛానల్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘కృష్ణ ముకుంద మురారి’ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అలాగే ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్’ అనే గేమ్ షో లో టాస్కులు అద్భుతంగా ఆడుతూ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈమె హౌస్ లోకి అడుగుపెడితే టైటిల్ ఆమెదే అంటూ సోషల్ మీడియా లో ఇప్పటి నుండే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

3) యష్మీ గౌడ :

అదే ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ లో విలన్ గా నటించిన యష్మీ గౌడా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. వీళ్లిద్దరి మధ్య పోరు హౌస్ లో ఎలా ఉండబోతుందో చూడాలి.

4) శేఖర్ బాషా :

ఈమధ్యనే హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య వ్యవహారం లో సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయిన శేఖర్ బాషా కూడా హౌస్ లోకి వచ్చారట.

5) బెజవాడ బేబక్క :

అలాగే బెజవాడ బేబక్క, డ్యాన్సర్ నైనికా, అంజలి పవన్ వంటి వారు కూడా హౌస్ లోకి వెళ్లినట్టు సమాచారం.మిగిలిన కంటెస్టెంట్స్ రేపు ఉదయం జరగబోయే షూటింగ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. ఇందులో మూడు బెడ్ రూమ్స్ ఉంటాయట. ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించేలా మొదటి రోజు నుండే టాస్కులు ఉంటాయని సమాచారం. హౌస్ లోకి అడుగుపెట్టే ముందు కంటెస్టెంట్స్ తో పలు టాస్కులు ఆడించి నాగార్జున లోపలకు పంపినట్టు తెలుస్తుంది. ఈ సీజన్ లో సెలెబ్రిటీలకంటే ఎక్కువగా కొత్త వాళ్ళే కనిపించనున్నారు. చూడాలి మరి ఈ సీజన్ గత సీజన్ లాగా పెద్ద హిట్ అవుతుందా, లేదా సీజన్ 6 లాగా ఫ్లాప్ అవుతుందా అనేది.