పవన్ కల్యాణ్ ఎంతటి మానవతా వాది అన్న సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి రాకముందు కూడా.. ఆయన ఎంతో మందిని ఆదుకున్నారు. కష్టాల్లో ఉన్న అభిమానుల వద్ద స్వయంగా వెళ్లి కలిశారు. ఆర్థిక సహకారం అందించారు. మీడియా దృష్టికి రాకుండా ఆయన చేసిన సహాయాలు కోకొల్లలు. తాజాగా.. పవన్ మరో అభిమానిని కలిశాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానికి ఆత్మీయ స్పర్శ అందించారు.
Also Read: మోస్ట్ హ్యాండ్సమ్ లుక్ లో పవన్.. మళ్లీ ఖుషీ రోజులు గుర్తొస్తున్నాయి!
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన భార్గవ అనే 19ఏళ్ల కుర్రాడు క్యాన్సర్ బారిన పడ్డాడు. మంచానికే పరిమితం అయిన భార్గవ.. పవన్ ను కలుసుకోవాలని ఆరాట పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ అక్కడికి వెళ్లారు. పవన్ రాకను తెలుసుకున్న అభిమానులు భారీగా తరలి వచ్చారు. జగ్గయ్యపేటలో పవర్ స్టార్ కు ఘన స్వాగతం పలికారు.
చిల్లకల్లు నుంచి లింగాల గ్రామం వరకు వందలాది బైకులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పవన్ భార్గవ నివాసానికి చేరుకున్నారు. మంచంపై ఉన్న అభిమానిని చూసి చలించి, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత భార్గవతో ఆత్మీయంగా మట్లాడారు పవన్. తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
Also Read: స్టేజ్ పైనే అనసూయను అక్కడ పట్టుకున్నాడు.. చూసిన వారంతా షాక్!
అనంతరం కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి హెల్త్ కండీషన్ గురించి వాకబు చేశారు. కాసేపు వారితో అక్కడే గడిపారు. ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం భార్గవ ఆసుపత్రి ఖర్చుల కోసం భారీగా ఆర్థిక సాయం చేశారు. రూ.5 లక్షలు అందించారు పవన్. ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుందని ధైర్యం చెప్పారు.
భార్గవ వైద్యం కోసం ప్రవాస ఆంధ్రుల నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు పవన్. అంతేకాదు.. జనసేన తరపున వైద్య బృందాన్ని కూడా పంపిస్తానని చెప్పారు. అనంతరం వెండితో తయారు చేసిన వినాయకుడి ప్రతిమను కూడా అందజేశారు. తప్పకుండా భార్గవ తిరిగి మామూలు మనిషి అవుతాడని, దైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు చెప్పి బయల్దేరారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్