దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎన్నో సర్వీసులను కస్టమర్లకు అందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న సర్వీసులలో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఒకటి. ఎస్బీఐ కస్టమర్లు ఈ సౌకర్యం ద్వారా అకౌంట్ లో డబ్బులు లేకపోయినా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఎస్బీఐ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది.
Also Read: ఈ తప్పులు చేస్తున్నారా.. గ్యాస్ సిలిండర్ పేలిపోయే ఛాన్స్..?
ఎస్బీఐ ప్రీఅప్రూవ్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ సౌకర్యం అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరైతే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందాలని భావిస్తారో వాళ్లు ఈ సర్వీసుల కోసం సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, షేర్లు, ప్రాపర్టీ, ఇన్సూరెన్స్ పాలసీ, బాండ్లు వంటి వాటిని తనఖా పెట్టడం ద్వారా ఎస్బీఐ కస్టమర్లు లోన్ ను పొందవచ్చు. ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవాళ్లు కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని పొందడానికి అర్హులు.
Also Read: రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష..?
బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టి కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఎంచుకోవచ్చు. ఎవరైతే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఎంచుకుంటారో వారికి ఎస్బీఐ ఒక లిమిట్ వరకు డబ్బులను తీసుకునే అవకాశం కల్పిస్తోంది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని వినియోగించుకున్న కస్టమర్లు ఎంత డబ్బును వినియోగించుకున్నారో అంత డబ్బుకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు అవసరం లేని సమయంలో ఓవర్ డ్రాఫ్ట్ ను క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వల్ల సులభంగా డబ్బును పొందే అవకాశం ఉంటుంది.