Pawan Kalyan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ టచ్ చేసే హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలను చేస్తూ అక్కడ కూడా మంచి ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు…
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు వరుసగా ఏడు సినిమాలతో మంచి విజయాలను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న ఆయన ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన సెట్స్ మీద ఉంచిన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద మూడు సినిమాలు ఉండగా వాటిని పూర్తి చేసే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించిన షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన ఆయన జూన్ 12వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read : అందరూ ప్రశ్నిస్తున్న వేళ.. ఎట్టకేలకు స్పందించిన పవన్ కళ్యాణ్.. సంచలన ఆదేశాలు
ప్రస్తుతం ఓజీ (OG) సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ఆయన ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Usthad Bhagath Singh) సినిమాని సైతం ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఈ ఇయర్ మొత్తం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) వన్ మ్యాన్ షో చేయబోతున్నట్టుగా సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఈ మూడు సినిమాల్లో కనీసం రెండు సినిమాలైనా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన మార్కెట్ భారీ రేంజ్ లో విస్తరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక ఈయన నుంచి సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాబోయే సినిమా భారీ విజయాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతో తన అభిమానులైతే కోరుకుంటున్నారు. మరి అందరి అంచనాలను అందుకుంటూ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ఈ సంవత్సరం తన మొదటి సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం జూన్ 12వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…