Vijay Jana Nayagan expectations: 2013 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం సృష్టించిన సునామీ ఎలాంటిదో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమాకు ఎదురైనటువంటి కష్టాలు ఇండస్ట్రీ లో అప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఎదురు అవ్వలేదు. ఒకపక్క సమైక్య ఆంధ్ర ఉద్యమం తారా స్థాయిలో జరుగుతుంది. ఆ కారణం చేత విడుదల తేదీని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అలాంటి సమయం లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ మొత్తం HD క్వాలిటీ ప్రింట్ తో సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. విడుదల లోపు పూర్తి సినిమా కూడా అందుబాటులోకి వచ్చేసింది. అయ్యో దేవుడా , ఇక పాపం నిర్మాత పరిస్థితి ఏంటో అని అంతా బాధ పడ్డారు. కానీ దేవుడు ఆశీస్సులు , అభిమానుల ప్రేమ కారణంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన మ్యాజిక్ ని చూసి అప్పట్లో ట్రేడ్ విశ్లేషకులు నివ్వెరపోయారు.
మొదటి రోజు ఓపెనింగ్ నుండి క్లోజింగ్ వరకు ఈ సినిమా సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామీ మామూలుది కాదు. అప్పటి వరకు మగధీర చిత్రానికి దరిదాపుల్లో ఒక్క స్టార్ హీరో కూడా రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా ఆ సినిమా రికార్డుని అవలీల గా దాటేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. మొదటి రోజు నమోదు అయ్యే వసూళ్లు , రెండవ రోజు, మూడవ రోజు వచ్చేవి. అలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది ఆ చిత్రం. అయితే ఇప్పుడు విజయ్ కూడా అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నాడా ?, సవాళ్ళను ఎదురుకొని భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడా అని ఇప్పుడు తమిళనాడు జోరుగా సాగుతున్న చర్చ.
ఎందుకంటే నిన్న ఈ చిత్రం మొత్తం HD క్వాలిటీ ప్రింట్ తో సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. విజయ్ ని ఇష్టపడని వాళ్ళు , ఈ సినిమాలోని సన్నివేశాలను సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో తిప్పుతూ వైరల్ చేస్తున్నారు. అనేక సన్నివేశాలు విపరీతంగా ట్రోల్ కి గురి అవుతున్నాయి. వీటి అన్నిటికీ తోడు ఈ చిత్రం ‘భగవంత్ కేసరి’ కి జిరాక్స్ కాపీ అనే విషయం కూడా అందరికీ అర్థం అయిపోయింది. ఇన్ని సవాళ్ళను ఎదురుకొని ఈ సినిమా సక్సెస్ అందుకుంటుందా?, ఒకవేళ అందుకుంటే మాత్రం విజయ్ క్రేజ్ కి , ఆయన స్టార్ స్టేటస్ కి ట్రేడ్ చేతులెత్తి మొక్కినా తప్పు లేదు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా తలరాత ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో చూడాలి.