Pawan Kalyan Political Leader in Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. అందులో “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” ఒకరు. ఈయన చేసిన ప్రతి సినిమా హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ ను అయితే క్రియేట్ చేస్తుంది. ఇక ఈయన సినిమా వస్తుంది అంటే చాలు ఆయన అభిమానులందరు రెండు మూడు రోజుల నుంచి ఆ సినిమా కోసం విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక సినిమా టికెట్లను బుక్ చేసుకొని మరి ఫస్ట్ షో నే ఆ సినిమా చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ పెట్టి రాజకీయంగా కూడా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే అటు రాజకీయంగా ముందుకు సాగుతూనే, ఇటు సినిమాలను కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ ను క్రియేట్ చేసింది. అలాగే పొలిటికల్ గా కూడా కొంతవరకు హీట్ పెంచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చివరి 15 నిమిషాలు ‘పొలిటికల్ లీడర్’ గా కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమా మొత్తం ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. కానీ సినిమా చివర్లో మాత్రం కొన్ని కారణాల వల్ల ఆయన పొలిటికల్ లీడర్ గా మారాల్సి వస్తుందట.
ఇక ఈ విషయం సినిమా యూనిట్ నుంచి బయటికి వచ్చిందంటూ సోషల్ మీడియా లో ఈ న్యూస్ మీద విపరీతమైన రచ్చ నడుస్తుంది. ఇక నిజానికి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా పార్టీ పెట్టి ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ పాత్రలో కూడా నిజీవితపు ఛాయలు కనిపించబోతున్నాయని మరి కొంతమంది అభిమానులు ఈ న్యూస్ కి కామెంట్లు అయితే చేస్తున్నారు…