Pawan Kalyan Johnny Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా అవతరించాడు. వరుసగా ఏడు విజయాలతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. అయితే తన స్వీయ డైరెక్షన్లో వచ్చిన ‘జానీ’ సినిమాతో ఫ్లాప్ ని మూట గట్టుకున్న ఆయన అక్కడి నుంచి వరుసగా 10 సంవత్సరాలపాటు ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేకపోయాడు… జానీ సినిమాని అనుకున్నప్పుడు మొదట ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ కథను అందించాలనుకున్నారట. డైరెక్షన్ మాత్రం వేరే దర్శకుడితో చేయించాలని భావించారట. అలాగే అందులో తను హీరోగా నటించాలనే ప్రయత్నం చేశాడు. అయిన కూడా అది వర్కౌట్ అయితే కాలేదు. దానికోసం మొదట ఒక కొత్త దర్శకుడిని తీసుకోవాలనుకున్నారట.
కానీ ఆ దర్శకుడు ఆ సినిమా కథకి అంతగా కనెక్ట్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం…మొత్తానికైతే ఈ సినిమా భారీ డిజాస్టర్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నుంచి వచ్చిన మొదటి భారీ డిజాస్టర్ సినిమా జానీ నే కావడం విశేషం…
ఈ సినిమాకి ఇప్పటికీ చాలామంది కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తో పాటు ఆయన పర్ఫామెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో సినిమాను డైరెక్షన్ చేయలేదు. కారణమేంటి అంటే ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు.
వరుస సినిమాలను చేసుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతను కొనసాగిస్తూనే అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఈ సంవత్సరం ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమాతో భారీగా డీలా పడిపోయాడు…