Jalsa Special Shows Rare Record Overseas: వచ్చే నెల 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచం నలుమూల జల్సా సినిమా స్పెషల్ షోస్ ని అభిమానులు నిర్వహిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈరోజు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ 200 GB సైజు ఉన్న జల్సా సినిమా ఫైల్ ని క్యూబ్ నుండి అప్లోడ్ చేసుకున్నారు..క్వాలిటీ అదిరిపోయినట్టు అనిపిస్తుంది..ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆస్ట్రేలియా లో మెల్బోర్నే లో ప్రారంభించేసారు..ఇప్పుడు అతి త్వరలోనే ఆఫ్రికా , యూరోప్ మరియు అమెరికా వంటి ఓవర్సీస్ ప్రాంతాలలో కూడా బుకింగ్స్ ప్రారంభించబోతున్నారు..అయితే సౌత్ ఆఫ్రికా లో స్పెషల్ షో వెయ్యబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమా జల్సా నే కావడం విశేషం..గతం లో కూడా ఇలాంటి అరుదైన రికార్డు పవన్ కళ్యాణ్ పేరు మీదనే ఉన్నది..2005 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలైన బాలు సినిమా కూడా సౌత్ ఆఫ్రికా లో విడుదలైంది..అలా సౌత్ ఆఫ్రికా లో మొట్టమొదట విడుదలైన సినిమా బాలు అయితే, ఇప్పుడు అదే సౌత్ ఆఫ్రికా లో మొట్టమొదటిసారిగా జల్సా సినిమా స్పెషల్ షోస్ ని నిర్వహించుకోబోతుంది.

ఈ నెల 9 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాని కూడా ఇలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో స్పెషల్ షోస్ వేశారు..వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..కానీ యూరోప్ మరియు సౌత్ ఆఫ్రికా వంటి ప్రాంతాలలో పోకిరి స్పెషల్ షోస్ ని ప్లాన్ చేయలేదు..కానీ జల్సా సినిమాని మాత్రం తెలుగు వాళ్ళు ఏ దేశాల్లో ఉంటె ఆ దేశం లో స్పెషల్ షో ని ప్లాన్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు అభిమానులు..ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కేవలం ఈ రెండు ప్రాంతాల నుండి ఈ సినిమాకి 500 కి పైగా షోస్ వేస్తున్నారట..అతి త్వరలోనే ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్ కూడా బయటకి రాబోతుంది..పోకిరి సినిమా స్పెషల్ షోస్ నుండి దాదాపుగా ఒక కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఇప్పుడు జల్సా సినిమా ఆ రికార్డు ని బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి..ఈ సినిమా కి చేస్తున్న ప్లానింగ్స్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ని చూస్తుంటే అది పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తుంది..చూడాలి మరి.

Also Read: Ratan Tata Shanthanu: 84ఏళ్ల టాటాకు 28 ఏళ్ల శాంతను అంటే ఎందుకంత ఇష్టం? అసలు ఎవరీ శాంతను?
[…] […]