
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటూ రాజకీయాల్లోనూ.. ఇటూ సినిమాల్లోనూ బీజీగా ఉన్నారు. రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా పవన్ కల్యాణ్ ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ మూవీ ‘పింక్’ను తెలుగులో ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీని నిర్మాత దిల్ రాజు.. శ్రీదేవి భర్త బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: పవన్ కొత్త సినిమాకి పాత టైటిల్ నిజమేనా ?
‘వకీల్ సాబ్’ శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న సమయంలోనే కరోనా ఎఫెక్ట్ తో సినిమా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీ సంక్రాంతి రేసులో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్ తో ఎగ్జిబిషన్.. డిస్ట్రిబ్యూషన్ రంగం పూర్తిగా దెబ్బతింది.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో మినహా తెలుగు సినిమాలు పత్తాకు లేకుండా పోయాయి. కరోనా ఎఫెక్ట్ తో గత ఏడునెలలుగా థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడు థియేటర్లు తెరుచుకుంటున్నాయి. అయితే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో కొత్త సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు.
ఈ ఏడాది నష్టాలను వచ్చే ఏడాదిలోనైనా కవర్ చేసుకోవాలంటే భారీ చిత్రాలు పెద్దఎత్తున విడుదల కావాల్సిందేనని థియేటర్ల నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ సినిమాలు థియేటర్లలో ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సినిమాలు కరోనా ఎఫెక్ట్ గా మందుగా పని చేయనుందనే టాక్ విన్పిస్తోంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ రానుందనే టాక్ విన్పిస్తోంది. దీంతోపాటు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ మూవీ వేసవిలో.. క్రిష్-పవన్ మూవీ దసరాకు రానుందట. ఇలా ఈ ఏడాది పవన్ కల్యాణ్ నటించి మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
Also Read: పిల్ల దొరక లేదు గానీ.. పెళ్లికి రెడీ అంటున్న తేజు.. !
అదేవిధంగా హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రానున్న సినిమాలు 2022లో రానున్నాయనే టాక్ విన్పిస్తోంది. వచ్చే రెండేళ్లలో పవర్ స్టార్ మూవీలు కరోనాకు దెబ్బకు విరుగులా పని చేస్తాయని థియేటర్ల నిర్వాహాకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా దెబ్బకు కుదేలైన డిస్ట్రిబ్యూషన్.. ఎగ్జిబిషన్ రంగాన్ని ‘పవర్ స్టార్’ ఏమేరకు ఆదుకుంటాడో వేచిచూడాల్సిందే..!