Hari Hara Veeramallu : ఒకప్పుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో సినిమా చేయాలని రాజమౌళి(SS Rajamouli) లాంటి డైరెక్టర్స్ కూడా కోరుకునేవారు. ఎందుకంటే సౌత్ ఇండియా లో టాక్ తో సంబంధం లేకుండా కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఆయనకు మాత్రమే ఉంది అని వాళ్ళ నమ్మకం. అంతే కాకుండా ఎలాంటి జానర్ కి అయినా సరితూగే స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న అతి తక్కువమంది ఇండియన్ హీరోలలో పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన కంఫర్ట్ కి తగ్గట్టుగా సినిమాలు చేస్తుంటాడు. స్టార్ డైరెక్టర్స్ జోలికి వెళ్లకుండా, కేవలం మీడియం రేంజ్ డైరెక్టర్స్ తోనే ఆయన ఇంతకాలం సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇదంతా గతం, కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నిర్మాతలకు ఆయనతో సినిమాలు తీయడం నరకప్రాయంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత ఎలాగో ఓడిపోయాడు కాబట్టి ఒక మూడు సినిమాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి విడుదల చేసాడు.
కానీ ప్రభుత్వం లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నిర్మాతలకు అసలు అందుబాటులో ఉండడం లేదు. ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రాన్ని పూర్తి చేయడానికి నాలుగు రోజులు, అదే విధంగా ‘ఓజీ'(They Call Him OG) చిత్రాన్ని పూర్తి చేయడానికి 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. కేవలం 25 రోజులు కళ్ళు మూసుకుంటే ఈ రెండు సినిమాలు పూర్తి అవుతాయి. కానీ వీటిని పూర్తి చేయడానికే ఆయన నిర్మాతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఇప్పటికే నిర్మాత AM రత్నం 300 కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేసాడు. కేవలం పవన్ కళ్యాణ్ నుండి నాలుగు రోజుల కాల్ షీట్స్ దొరికితే సినిమాని పూర్తి చేసి వచ్చే నెల 28 న విడుదల చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారు. కానీ ఆయన దొరకడం లేదు.
గత 15 రోజులుగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతం లో ఉన్నాడు. అందులో నాలుగు రోజుల నుండి ఆయన తీవ్రమైన వెన్ను నొప్పి, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు. ఇప్పుడే ఆయన అనారోగ్యం నుండి కోలుకున్నాడు. అనారోగ్యం నుండి కోలుకున్నాడు కదా,ఇక షూటింగ్ లో పాల్గొంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రేపటి నుండి మూడు రోజుల పాటు దక్షిణ భారత దేశంలో ఉన్న ప్రధాన ఆలయాలను సందర్శించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూడు రోజుల పర్యటన తర్వాత ఆయన డేట్స్ సార్డబుబాటు చేసే అవకాశం ఉంది. కానీ దాని గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఫిబ్రవరి నెలలో ఎట్టి పరిస్థితిలో సినిమాని పూర్తి చేయాలి. లేదంటే సినిమాని మళ్ళీ వాయిదా వేయాల్సి ఉంటుంది. దీని వాళ్ళ AM రత్నం నిర్మాతగా కోట్ల రూపాయలలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఇతన్ని కరుణిస్తాడా లేదా అనేది చూడాలి.