https://oktelugu.com/

TATA Company : అస్సలు ఊహించని పాత కారును కొత్తగా రీడిజైన్ చేసి డింపుతున్న TATA.. మార్కెట్ షేక్.. ప్రత్యర్థులకు వణుకు

గతంలో సక్సెస్ అయిన కార్లలో తిరిగి వినియోగదారులకు పరిచయం చేసి ఆకట్టుకుంటున్నారు. తాజాగా టాటా కంపెనీ గతంలో ఆదరణ పొందిన ఓ SUV ని తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ కారు గురించి తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి.

Written By:
  • Srinivas
  • , Updated On : February 11, 2025 / 12:14 PM IST
    TATA New Model Sierra

    TATA New Model Sierra

    Follow us on

    TATA Company :  కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. చాలామంది వినియోగదారులు సొంతంగా వెహికల్ ఉండాలని అనుకుంటున్నారు. వివిధ అవసరాలని నిమిత్తం వారికి తగిన విధంగా కారులను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఎక్కువ శాతం మంది SUV కార్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బూస్ట్ స్పేస్ కాస్త ఎక్కువగా ఉండి ఇంజన్ పనితీరు మెరుగ్గా ఉండే ఈ కార్లకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా SUV లను మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటాయి. అయితే ఇదే సమయంలో కొన్ని కార్లు కొత్తవి తయారు చేయకుండా పాత వాటిని కొన్ని మార్పులు చేసి మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. గతంలో సక్సెస్ అయిన కార్లలో తిరిగి వినియోగదారులకు పరిచయం చేసి ఆకట్టుకుంటున్నారు. తాజాగా టాటా కంపెనీ గతంలో ఆదరణ పొందిన ఓ SUV ని తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ కారు గురించి తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి.

    దేశంలో అత్యధిక కార్లు సేల్స్ నమోదు చేయడంలో TATA కంపెనీ టాప్ లెవల్ లో ఉంటూ వస్తుంది. ఈ కంపెనీకి చెందిన ఎన్నో కార్లు వినియోగదారుల ఆదరణ పొందాయి. హచ్ బ్యాక్ నుంచి SUV వరకు వివిధ రకాల మోడల్ లను మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ కంపెనీ తాజాగా తన పాత కారును మార్కెట్లోకి తీసుకు రాబోతుంది. టాటా కంపెనీ నుంచి 1991 నుంచి 2023 వరకు మార్కెట్లో ప్రసిద్ధి చెందిన Sierra కారు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎస్ యు వి వెరీ అంటూ అయిన ఈ కారు మార్పులు తీసుకొని మళ్ళీ మార్కెట్లోకి రాబోతుంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఢిల్లీ ఆటోమోబిలిటీ షోలో దీనిని ప్రదర్శించారు. ఈ కారు చూడగానే అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ కారు ఫీచర్స్, ధర ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

    పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజన్, ఎలక్ట్రిక్ వేరియంట్ ను కలిగిన ఈ కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. అలాగే 2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్తో పనిచేస్తుంది. ఈ ఏంజెల్ లపై లీటర్ ఇంధనానికి 18 నుంచి 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఎలక్ట్రిక్ వేరియంటల్ కూడా కలిగిన ఈ కారును ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు..

    Yellow కలర్ లో ఆకట్టుకునే డిజైన్ లో ఉన్న ఈ కారులో ఎల్ఈడి హెడ్ లాంప్ లు, ఎల్ఈడి లైట్ సెటప్, బాడీ కలర్ పిల్లర్లు ఉన్నాయి. డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ప్లస్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ వంటివి ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇందులో త్రీ స్క్రీన్ సెటప్, ఫోర్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ కలిగి ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. సేఫ్టీ కోసం కూడా ఇందులో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లో ఉన్నాయి. ఇక దీని ధర రూ 10.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.