Pawan Kalyan Mythri Movie Makers: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాజకీయాలు రోజురోజుకి ఎక్కువ అయిపోతున్నాయా..?, కొత్త ఇండస్ట్రీ లోకి వచ్చి నిర్మాత వచ్చి ఒక్కో మెట్టు ఎదుగుతూ పొతుంతే దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్న టాప్ 4 నిర్మాతలు జీర్ణించుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers)..ఈమధ్య కాలం లో పాన్ ఇండియా లెవెల్ లో వినిపిస్తున్న పేరు ఇది. సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం తో వీళ్ళ ప్రయాణం మొదలైంది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) తో జనతా గ్యారేజ్, రామ్ చరణ్(Global Star Ram Charan) తో రంగస్థలం, అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తో పుష్ప సిరీస్ వంటి సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించి ఇండస్ట్రీ లో బలమైన పాదముద్ర వేశారు. ప్రస్తుతం ఈ సంస్థ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా, ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నారు.
Also Read: ముచ్చటగా మూడవసారి తల్లి కాబోతున్న హీరోయిన్ జెనీలియా..ఫోటోలు వైరల్!
కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అవ్వకుండా కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ సంస్థ పాగా వెయ్యాలని చూస్తుంది. ఇప్పటికే తమిళంలో అజిత్ కుమార్(Thala Ajith Kumar) తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తెరకెక్కించింది, అదే విధంగా బాలీవుడ్ లో సన్నీ డియోల్ తో ‘జాట్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని కూడా తెరకెక్కించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకున్నాయి. త్వరలోనే రజినీకాంత్ తో ఒక సినిమా, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో మరో సినిమా చేయబోతున్నారట. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేవలం నిర్మాతగా మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అతి తక్కువ కాలం లోనే భారీ సక్సెస్ రేట్ ని చూసింది.
సొంతంగా అనేక ప్రాంతాల్లో థియేటర్స్ ని నిర్మించడం కూడా ప్రారంభించింది. ఇలా ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాతలుగా మారిపోవడం, స్టార్ హీరోల డేట్స్ మొత్తం ఈ సంస్థకే వెళ్లిపోతుండడం వంటివి ఒక నలుగురి నిర్మాతలకు అసలు నచ్చడం లేదట. ప్రతీ విషయం లోనూ మైత్రీ మూవీ మేకర్స్ అడ్డుగా వస్తున్నట్టు వాళ్లకు అనిపిస్తుందట. మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం అత్యధిక బిజినెస్ మైత్రీ మూవీ మేకర్స్ కి వెళ్తుందట. ఇవన్నీ చూసి తట్టుకోలేకనే అకస్మాత్తుగా సినీ కమీషన్ బేసిస్ మీద సినిమా థియేటర్స్ నడపాలని టాపిక్ వచ్చిందని, జూన్ 1 నుండి థియేటర్స్ మూసి వేస్తామనే అంశాలు తెరమీదకు వచ్చాయని, ఇవన్నీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి తెలియడం తో ఆ నలుగురి నిర్మాతల తోకలు కట్ చేసి మైత్రీ మూవీ మేకర్స్ కి సపోర్ట్ గా నిలిచాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట.