Bhairavam Collection Day 2: మంచు మనోజ్(Manchu Manoj), బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohit) లు హీరోలుగా నటించిన భైరవం(Bhairavam Movie) చిత్రం గత నెల 30 వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందు ఈ చిత్రం అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. డైరెక్టర్ విజయ్ కనకమేడల చేసిన కొన్ని కామెంట్స్ కి ఈ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఒక క్యాంపైన్ కూడా చేసారు. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బాగున్న సినిమాని చంపలేరు అనేందుకు నిదర్శనంగా నిల్చింది ఈ చిత్రం. మొదటి రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 39 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కానీ రెండవ రోజు ఏకంగా 40 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోవడం గమనించాల్సిన విషయం.
మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అందులో నైజాం ప్రాంతం నుండి 65 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 25 లక్షలు,ఆంధ్రా ప్రాంతం నుండి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి మరో 35 లక్షలు రాగా ఓవరాల్ గా ఈ చిత్రానికి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సినిమాకి గ్రౌండ్ లెవెల్ లో మంచి పాజిటివ్ టాక్ ఉండడం తో రెండవ రోజు ప్రతీ సెంటర్ లోనూ మొదటి రోజుకంటే ఎక్కువ షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఫలితంగా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రెండవ రోజున రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అయితే ముగ్గురు హీరోలు కలిసి నటించిన సినిమా కావడం, పైగా ఈ ముగ్గురి హీరోల సోలో చిత్రాలు విడుదలై కూడా చాలా కాలం అవ్వడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 17 కోట్ల రూపాయలకు జరిగింది. కచ్చితంగా మూడవ రోజు కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్లు వస్తాయి. కానీ ఈ మూడు రోజుల వసూళ్లు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ చిత్రానికి కచ్చితంగా వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయి హోల్డ్ ని కనబర్చాలి. సమయం కూడా ఎక్కువ లేదు. ఎంత వసూళ్లను రాబట్టినా 12 వ తేదీలోపు రాబట్టాలి. ఎందుకంటే 12 న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కాబోతుంది. థియేటర్స్ అన్ని ఆ చిత్రానికే వెళ్లిపోతాయి. మరి అప్పటి లోపు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందో లేదో చూద్దాం.