https://oktelugu.com/

Pawan Kalyan : రామ్ చరణ్ – ఉపాసనని కలవడానికి హైదరాబాద్ రాబోతున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర మొదటి విడత ని ఈ నెల 27 వ తారీఖున ముగించబోతున్నాడు. ఆ తర్వాత వెంటనే ఆయన హైదరాబాద్ కి చేరుకొని రామ్ చరణ్ మరియు ఉపాసన ని కలిసి, పాప తో కాసేపు సమయాన్ని గడపబోతున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : June 23, 2023 / 08:28 PM IST
    Follow us on

    Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు అంటూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఆయన అభిమానులు మరియు కార్యకర్తలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ‘వారాహి విజయయాత్ర’ ని దిగ్విజయంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చేస్తున్నాడు. ఈ యాత్ర ద్వారా ఆయన ప్రజలతో మమేకమై , వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ,బహిరంగ సభలలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నడు.

    అంతే కాకుండా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఆయన చేస్తున్న ప్రసంగాలకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్న సమయం లోనే రామ్ చరణ్ – ఉపాసన ఒక ఆడబిడ్డకు జన్మని ఇచ్చారు. మెగా ఫ్యామిలీ మొత్తం అపోలో హాస్పిటల్స్ కి వెళ్లి, ఉపాసన ని మరియు పాపని చూసి వచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ రానందుకు ఫ్యాన్స్ కాస్త నిరాశకి చెందారు.

    ఆయన యాత్ర లో ఉన్నాడు అనే విషయం అందరికీ తెలుసు కానీ, ఈ శుభ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఉంటే బాగుండేది అని అనుకునేవాళ్లు ఉంటారు కదా, అందుకే కాస్త బాధపడ్డారు.అయితే పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర మొదటి విడత ని ఈ నెల 27 వ తారీఖున ముగించబోతున్నాడు. ఆ తర్వాత వెంటనే ఆయన హైదరాబాద్ కి చేరుకొని రామ్ చరణ్ మరియు ఉపాసన ని కలిసి, పాప తో కాసేపు సమయాన్ని గడపబోతున్నాడు. 28 లేదా 29 వ తారీఖున ఆయన వెళ్ళబోతున్నట్టు సమాచారం.

    పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ ని చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్ లో చూడబోతున్నందుకు అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం ఉపాసన అపోలో హాస్పిటల్స్ నుండి డెలివరీ అయినా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన కూతురుకి ఆశీస్సులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేసాడు.