https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ వస్తున్నాడు!

కరోనా బారినపడి పూర్తిగా సిక్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత బయటకు వస్తున్నాడు. కరోనా సోకి కోలుకున్నాక నీరసంతో బాధపడ్డ పవన్ కళ్యాణ్ అటు ఏపీ రాజకీయాలకు.. ఇటు సినిమాలకు పూర్తి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత లాక్ డౌన్ పడడంతో ఇక మరింతగా ఫాంహౌస్ లోనే రెస్ట్ తీసుకున్నారు. బయటకు ఎక్కడ కనిపించలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ బయటకు వస్తున్నాడు. జూలై నుంచి తన […]

Written By: , Updated On : June 20, 2021 / 12:54 PM IST
Follow us on

Pawan Kalyan

కరోనా బారినపడి పూర్తిగా సిక్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత బయటకు వస్తున్నాడు. కరోనా సోకి కోలుకున్నాక నీరసంతో బాధపడ్డ పవన్ కళ్యాణ్ అటు ఏపీ రాజకీయాలకు.. ఇటు సినిమాలకు పూర్తి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత లాక్ డౌన్ పడడంతో ఇక మరింతగా ఫాంహౌస్ లోనే రెస్ట్ తీసుకున్నారు. బయటకు ఎక్కడ కనిపించలేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ బయటకు వస్తున్నాడు. జూలై నుంచి తన సినిమాలు మొదలుపెట్టబోతున్నాడట.. ఈ మేరకు నిర్మాతలు, దర్శకులకు కాల్షీట్లు సర్దుబాటు చేసినట్టు టాలీవుడ్ సమాచారం.

జులై రెండో వారం నుంచి పవన్ కళ్యాణ్ నిర్మాతలకు కాల్షీట్లు ఇచ్చినట్టు సమాచారం. అయితే షూటింగ్ కు రావడానికి పవన్ ఓ కండీషన్ పెట్టాడట.. తప్పనిసరిగా షూటింగ్ లో పాల్గొనే అందరికీ, సిబ్బందికి, పనివారికి వ్యాక్సిన్లు వేయించాలని నిర్మాతలకు సూచించారట.. జులై రెండో వారంలోపు ఈ ప్రక్రియ ముగించాలని.. ఆ తర్వాతనే షూటింగ్ మొదలుపెట్టాలని స్పష్టం చేశాడట..

ప్రస్తుతం జూలై రెండో వారంలో పవన్ ముందుగా కాల్షీట్లు ఇచ్చింది అయ్యప్పమమ్ కోషియమ్’ రిమేక్ మూవీకి. ఈ సినిమా కోసం సెట్ రెడీ చేశారట.. రానా, పవన్ ల మధ్య సీన్లు ఇందులో తీస్తారట..

ఇక క్రిష్ దర్శకత్వంలో సినిమాకు కూడా పవన్ మొదలుపెట్టబోతున్నాడు. లాక్ డౌన్ కు ముందే సిద్ధం చేసిన సెట్ లో ఆ సినిమాను జూలైలోనే పవన్ మొదలు పెట్టబోతున్నాడు. ఇలా ఒకేసారి రెండు సినిమాలను పవన్ షురూ చేయబోతున్నాడు. దీంతో ఫ్యాన్స్ కు మరోసారి పవన్ కనిపించబోతున్నాడన్నమాట..