https://oktelugu.com/

తమిళ డైరెక్టర్ ప్రేమలో తెలుగు హీరోయిన్ !

టాలీవుడ్ లో నాలుగేళ్ల క్రితం వరకూ తెలుగు హీరోయిన్ అంజలికి మంచి డిమాండ్ ఉంది. కానీ కెరీర్ లో తీసుకున్న రాంగ్ డెసిషన్స్ కారణంగా క్రేజ్ పోయింది. వచ్చే అవకాశాలు పోయాయి. మొత్తమ్మీద ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్ రావడం కూడా ఎక్కువ అన్నట్టు తయారైంది అంజలి పరిస్థితి. అసలుకే హీరోయిన్ గా కూడా కెరీర్ బాగాలేదు. ఇలాంటి బ్యాడ్ టైమ్ లో అంజలికి ప్రేమలో పడిందని తెలుస్తోంది. కోలీవుడ్ కు చెందిన ఓ యంగ్ డైరెక్టర్ తో […]

Written By:
  • admin
  • , Updated On : June 20, 2021 / 01:14 PM IST
    Follow us on

    టాలీవుడ్ లో నాలుగేళ్ల క్రితం వరకూ తెలుగు హీరోయిన్ అంజలికి మంచి డిమాండ్ ఉంది. కానీ కెరీర్ లో తీసుకున్న రాంగ్ డెసిషన్స్ కారణంగా క్రేజ్ పోయింది. వచ్చే అవకాశాలు పోయాయి. మొత్తమ్మీద ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్ రావడం కూడా ఎక్కువ అన్నట్టు తయారైంది అంజలి పరిస్థితి. అసలుకే హీరోయిన్ గా కూడా కెరీర్ బాగాలేదు. ఇలాంటి బ్యాడ్ టైమ్ లో అంజలికి ప్రేమలో పడిందని తెలుస్తోంది.

    కోలీవుడ్ కు చెందిన ఓ యంగ్ డైరెక్టర్ తో అంజలి గత కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తోందట. మరి ఈ పుకార్లు వాస్తవం ఎంత ఉందో తెలియదు గానీ, గతంలో కూడా అంజలి మీద ఇలాంటి పుకార్లు చాల వచ్చాయి. ఇంతకీ అంజలి ఎవరితో డేటింగ్ లో ఉందనే విషయం పై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఆమె గతంలో ఓ కోలీవుడ్ స్మాల్ హీరోతో కొన్నాళ్ళు పాటు డేటింగ్ లో ఉంది.

    ఈ ముద్దుగుమ్మ ఆ తమిళ హీరోని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంది. కానీ వీరిద్దరి బంధం పెళ్లి వరకు వెళ్ళలేదు. డేటింగ్ వ్యవహారం దగ్గరే ఆగిపోయింది. అతనికి దూరం అయ్యాక, కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న అంజలి, మొత్తానికి ఇప్పుడు ఫ్రెష్ గా మరో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసిందట. కనీసం ఈ బంధం అయినా ఆమెకు ఓ తోడును ఇస్తోందేమో చూడాలి.