https://oktelugu.com/

Pawan Kalyan OG Movie: పవన్ కళ్యాణ్ OG లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది!

పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ స్టైలిష్ గా కనిపించింది చివరిగా పంజా సినిమాలోనే. ఆ చిత్రం తర్వాత అన్నీ మాస్ లుక్స్ మరియు లవర్ బాయ్ లుక్స్ లోనే కనిపించాడు కానీ, ఇంత స్టైలిష్ గా మునుపెన్నడూ కనిపించలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ముంబై మరియు పూణే లో ఇది వరకే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసారు .

Written By:
  • Vicky
  • , Updated On : May 26, 2023 / 08:02 AM IST

    Pawan Kalyan OG Movie

    Follow us on

    Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో రోజురోజుకి ఆసక్తి ని పెంచుతున్న చిత్రం డైరెక్టర్ సుజిత్ తో చేస్తున్న #OG.మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్నాయి. ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరోని ఎలా అయితే చూడాలనుకున్నారో అలా చూస్తున్నందుకు, అదిరిపోయే స్టైలిష్ లుక్స్ ఉన్నందుకు ఎంతో సంతోషం గా ఫీల్ అవుతున్నారు.

    పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ స్టైలిష్ గా కనిపించింది చివరిగా పంజా సినిమాలోనే. ఆ చిత్రం తర్వాత అన్నీ మాస్ లుక్స్ మరియు లవర్ బాయ్ లుక్స్ లోనే కనిపించాడు కానీ, ఇంత స్టైలిష్ గా మునుపెన్నడూ కనిపించలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ముంబై మరియు పూణే లో ఇది వరకే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసారు .

    ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే ఇప్పటికే హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ ఖరారు అయ్యింది. మొదటి రెండు షెడ్యూల్స్ లో పాల్గొన్న ఈమె, హైదరాబాద్ లో జరుగుతున్న మూడవ షెడ్యూల్ లో కూడా పాల్గొంటుంది. ఇక ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మూవీ టీం ఈ చిత్రం లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో ని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    ఎవరు ఏమిటి అనే విషయం తెలియదు కానీ, టైగర్ ష్రాఫ్ లేదా , రణవీర్ సింగ్ లేదా ఆయుష్మాన్ ని మెయిన్ విలన్ రోల్ కోసం ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచెయ్యనుండి మూవీ టీం,సరైన బాలీవుడ్ హీరో ని తీసుకుంటే ఈ యాక్షన్ డ్రామాకి హిందీ లో సెన్సషనల్ ఓపెనింగ్ దక్కుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.